Telangana

News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో పగలు సెగలు.. రాత్రి చల్ల గాలులు

image

ఉమ్మడి జిల్లాలో పగటి వేళ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉంటోంది. సాయంత్రం వాతావరణం చల్లబడి, రాత్రి వేళల్లో చల్లగాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో గత 4 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా.. ఆదివారం జిల్లాలోని గండీడ్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కరోజులోనే 1.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో ఎండ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

News April 15, 2024

HYD: MMTS+RTC బస్ పాస్ రూ.1,350

image

సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్ నుమా కారిడార్లలో ప్రస్తుతం రోజుకు 76 MMTS రైళ్లు నడుస్తన్నాయి. వాటిలో గరిష్ఠంగా 45 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. MMTS రైళ్లు దిగిన తర్వాత ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా MMTS, బస్ పాస్ రూ.1,350 అందుబాటులోకి తెచ్చారు. తద్వారా గ్రేటర్‌లో రోజుకు సుమారు 8 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

News April 15, 2024

కామారెడ్డి: మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ

image

కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌‌‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌‌‌గా గడ్డం ఇందుప్రియని అధికారికంగా కామారెడ్డి RDO శ్రీనివాస్ ప్రకటించారు. ఛైర్ పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు చేశారు.

News April 15, 2024

BREAKING: ఆదిలాబాద్‌లో రోడ్డు ప్రమాదం

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద రోడ్డు క్రాస్ అవుతున్న ద్విచక్ర వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు కాగా అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మావల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

News April 15, 2024

MHBD: చల్లదనం కోసం ఆటో వాలా సూపర్ ఐడియా!

image

వేసవిలో ప్రయాణికులకు చల్లదనం కోసం ఓ ఆటో వాలా చేసిన ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా దర్గా తండాకు చెందిన అంజి అనే ఆటో యజమాని తన ఆటోలో ఎక్కేవారికి వేసవి ప్రభావం ఉండకుండా టాప్ పై మొక్కలు పెంచుతున్నాడు. ఆటో టాప్ పై ఇనుప ప్లేటును అమర్చి మట్టి పోసి గడ్డి పూల మొక్కలను పెంచుతూ వాటికి నీడ ఉండేలా గ్రీన్ పరదను ఏర్పాటు చేశారు. దీంతో ఆటోలో కూర్చున్న వారికి కూల్‌గా ఉంటుంది.

News April 15, 2024

కొత్తగూడెం: ప్రాణం తీసిన ఈత సరదా

image

స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కొత్త అంజనాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన వినోద్‌(17) కొత్తగూడెంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి స్థానిక చేపల చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ.. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News April 15, 2024

గద్వాల: రైలు ప్రమాదంలో గుంటూరు మహిళ మృతి

image

గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ సమీపంలో నిన్న జరిగిన <<13050560>>రైలు ప్రమాదం<<>>లో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం వేముల ప్రియాంకగా గుర్తించారు. ఉద్యోగరీత్యా భర్త జితేంద్రతో కలిసి జడ్చర్లలో ఉంటున్నారు. ఇటీవల భర్త తిరుపతికి వెళ్లగా ఆమె వారి బంధువులను చూసేందుకు గుంటూరు వెళ్లింది. తిరిగి జడ్చర్లకు వస్తుండగా గద్వాల వద్ద రైలు నుంచి కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 15, 2024

HYD నగరంలో కల్తీ మహమ్మారి.. మనమే TOP

image

NCRB-2022 నివేదిక ప్రకారం దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదయ్యాయి. వాటిలో 246 కేసులు HYD ప్రాంతానికి చెందినవే అంటే తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. HYD నగరంలో అల్లం, వెల్లుల్లి, టమాటా సాస్, మామిడి కాయలు, కూల్ డ్రింక్స్, ఫేస్ క్రీమ్ ఇలా కోకొల్లలుగా కల్తీ చేసే విక్రయిస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ అని గుర్తిస్తే తెలపాలన్నారు.

News April 15, 2024

HYD నగరంలో కల్తీ మహమ్మారి.. మనమే TOP

image

NCRB-2022 నివేదిక ప్రకారం దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదయ్యాయి. వాటిలో 246 కేసులు HYD ప్రాంతానికి చెందినవే అంటే తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. HYD నగరంలో అల్లం, వెల్లుల్లి, టమాటా సాస్, మామిడి కాయలు, కూల్ డ్రింక్స్, ఫేస్ క్రీమ్ ఇలా కోకొల్లలుగా కల్తీ చేసే విక్రయిస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ అని గుర్తిస్తే తెలపాలన్నారు.

News April 15, 2024

KMR: పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

మనస్తాపంతో సౌజన్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పాల్వంచ మండలం వాడిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం.. సౌజన్య భర్త 6 నెలల క్రతం బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లాడు. ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన సౌజన్య పురుగు మందు తాగింది. కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.