Telangana

News April 15, 2024

బెల్లంపల్లి: రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

image

అప్పుల బాధ, కల్లుకు బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన బన్న మల్లేష్ (49) కల్వరి చర్చి వెనకాల రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె. సురేష్ గౌడ్ తెలిపారు. అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

News April 15, 2024

UPDATE: దుండిగల్: మృతి చెందిన విద్యార్థి గుర్తింపు

image

దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని కారు ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి టెక్ మహీంద్రాయూనివర్సిటీకి చెందిన మేఘాంశ్‌గా గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులు సాయి మానస్, శ్రీ చరణ్ రెడ్డి, అర్నవ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News April 15, 2024

కాంగ్రెస్ నేతల దీక్షలు ఎన్నికల స్టంట్: బండి సంజయ్

image

మోదీ పాలనపై నిరసన పేరుతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్షలు ఎన్నికల స్టంట్ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్‌పై ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు.

News April 15, 2024

మామునూరు ఎయిర్‌పోర్టుకు అడుగులు!

image

మామూనూరులో విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇద్దరు ప్రయాణించేలా మూడు చిన్న మైక్రోలైట్ విమానాల ద్వారా ఇక్కడి నుంచి పర్యటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 775 ఎకరాల్లో ఉన్న విమానాశ్రయం అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా వాతావరణ అనుకూల పరిస్థితులు, సిగ్నల్ వ్యవస్థ తదితరాలపై 2 నెలలపాటు సర్వే చేపట్టేందుకు ప్రత్యేక సర్వే బృందం వచ్చి, 250 ఎకరాలకు సంబంధించి హద్దులు ఏర్పాటుచేశారు.

News April 15, 2024

MDK: కూరుతు కళ్లేదుటే తండ్రి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో కూరుతు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్ తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 15, 2024

వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలపై ఇక్రిశాట్ ఫోకస్

image

వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టి దిగుబడులను పెంచేందుకు HYD శివారులోని ఇక్రిశాట్ కృషి చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని వివిధ శీతోష్ణ, భూసార పరిస్థితులను ఆధారంగా చేసుకుని అప్లోటాక్సిన్-ఆస్పిరిజెల్లాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. తద్వారా రైతులు పంట పండించే ఖర్చు సైతం తగ్గుతుందన్నారు.

News April 15, 2024

వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలపై ఇక్రిశాట్ ఫోకస్

image

వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టి దిగుబడులను పెంచేందుకు HYD శివారులోని ఇక్రిశాట్ కృషి చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని వివిధ శీతోష్ణ, భూసార పరిస్థితులను ఆధారంగా చేసుకుని అప్లోటాక్సిన్-ఆస్పిరిజెల్లాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. తద్వారా రైతులు పంట పండించే ఖర్చు సైతం తగ్గుతుందన్నారు.

News April 15, 2024

WOW.. భద్రాచలం సీతమ్మవారికి త్రీడీ చీర

image

భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

మెదక్ జిల్లాలో వార్షిక పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నేటి నుండి వార్షిక పరీక్షలు ప్రారంభమాయ్యాయి. పరీక్షలు బాగా రాసేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాధికారి ప్రొ. రాధాకిషన్ ఆధ్వర్యంలో ఎండలు మండుతున్నందున అన్ని ఏర్పాట్లు చేశారు.

News April 15, 2024

జనగామ: చౌరస్తాలో వీరంగం.. కర్రలతో దాడి.. ఒకరి మృతి

image

జనగామలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు చౌరస్తాలో కర్రలతో దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. కారు అద్దాలు పగలగొట్టాడని కళాధర్, కమలాకర్, చిర్ర కమలాకర్‌తో పాటు.. మరికొందరు భాస్కర్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని MGMకు తరలించగా.. చికిత్సపొందుతూ మృతి చెందాడు.