Telangana

News April 15, 2024

WOW.. కరీంనగర్: సీతమ్మకు త్రీడీ చీర

image

భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

కాసిపేట: రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

image

కడప జిల్లాకు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. గత కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News April 15, 2024

NZB: మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం.. స్టేషన్‌కు తరలింపు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. తాను స్కూటీపై వెళుతుంటే కారులో వెళుతున్న వారు ఢీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారును ఆపి వారి నుంచి బలవంతంగా ఆర్సీ తీసుకుని అరగంట సేపు రచ్చ చేశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న వన్ టౌన్ SHO విజయ్ బాబు ఆర్సీ తీసుకుని బాధితులకు అప్పగించి కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు తరలించి టెస్ట్‌లు చేశారు

News April 15, 2024

బాలికను పెళ్లి చేసుకోబోయిన యువకుడికి రిమాండ్ !

image

బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. పాన్‌గల్ SI వేణు వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వనపర్తి మం. వశ్యనాయక్ తండాకు చెందిన శివ ప్రేమిస్తున్నాడు. గుట్టు చప్పుడుకాకుండా ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో  అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు SI చెప్పారు.

News April 15, 2024

NZB: ‘గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం’

image

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, నిజామాబాద్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దుబాయ్‌లో ఆదివారం రాత్రి జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు.

News April 15, 2024

HYD: రూ.13.72 కోట్ల నగదు సీజ్‌

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్డ్‌ బృందాలు HYD నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ.13.72 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్ తెలిపారు.

News April 15, 2024

ఆదిలాబాద్: గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓటు బ్యాంకు

image

ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంపై పార్టీలు దృష్టి సారించాయి. గత పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో గెలిచిన ఆదిలాబాద్ ఎంపీ బాపురావు 3,77,374 ఓట్లను సాధించాడు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4,43,13 ఓట్లు దక్కాయి. దీంతో ఈ సారి కూడా గెలుపు తమదేనంటూ బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.

News April 15, 2024

HYD: రూ.13.72 కోట్ల నగదు సీజ్‌

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్డ్‌ బృందాలు HYD నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ.13.72 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్ తెలిపారు.

News April 15, 2024

జిల్లాలో పటిష్ఠ తనిఖీలు: ఎస్పీ చందనా దీప్తి

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనా దీప్తి ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామన్నారు. వాడపల్లి, అడవిదేవులపల్లి, టైల్ పాండ్, నాగార్జునసాగర్ వద్ద చెక్‌ పో‌స్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారుల సహాయంతో జిల్లా మొత్తం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు.

News April 15, 2024

ఖమ్మం: ఓటు నమోదుకు నేటితో ముగియనున్న గడువు

image

ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు చేసుకునేవారు మే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.