Telangana

News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔NRPT:నేటి జన జాతర సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
✔నేడు PUలో జాబ్ మేళా
✔లింగాల: నేటి నుంచి కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు
✔MBNR: నేడు ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు
✔ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి వార్షిక పరీక్షలు
✔ఉట్కూరు: నేడు ఉచిత మెగా వైద్య శిబిరం
✔WNPT,GDWL: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✔నేడు కోస్గికు రానున్న మాజీ మంత్రి హరీష్ రావు
✔తాగునీటి సమస్యలపై అధికారుల ఫోకస్

News April 15, 2024

నల్గొండ: ఒక్కరోజే ముగ్గురు మృతి

image

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు. రామన్నపేట మండలానికి చెందిన రమేశ్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో చనిపోయారు. పాలకవీడు మండలం యల్లాపూరం గ్రామానికి చెందిన రమణారెడ్డి బైక్‌పై వెళ్తుండగా కల్వర్టును ఢీకొని మృతి చెందాడు. చౌటుప్పల్ మండలానికి చెందిన యాదయ్య XLపై పంతంగి గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది.

News April 15, 2024

దమ్మపేట: ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి

image

తాగునీటి కోసం వ్యవసాయ క్షేత్రంలో గల నీటికుంట వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిన ఘటన భద్రాద్రి(D) దమ్మపేట(M) అల్లిపల్లిలో జరిగింది. గంగుల గూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగరాజు మరో ఐదుగురితో కలిసి ఆదివారం అల్లిపల్లి గ్రామంలో కొబ్బరి బొండాలు కోత కోసే పనికి వెళ్లాడు. నాగరాజుకు దాహం వేయగా, అదే తోటలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.

News April 15, 2024

MDK: ఓటరు నమోదుకు నేడే చివరి తేదీ..

image

అర్హులైన యువతీ, యువకులు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు నేడే చివరి అవకాశం. ఈనెల 16న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కొనసాగుతున్న నూతన ఓటరు నమోదు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండి ఇంకా ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

News April 15, 2024

మెదక్: పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొండా సురేఖ

image

కాంగ్రెస్ లోకసభ అభ్యర్థులు, ఇంఛార్జీలతో నోవాటెల్ హోటల్ లో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటిలో మెదక్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ హజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ చర్చలో మెదక్, జహీరాబాద్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నీలం మధు, సురేశ్ షేట్కార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హజరయ్యారు.

News April 15, 2024

జక్రాన్ పల్లిలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తాం: జీవన్ రెడ్డి

image

తాను ఎంపీగా గెలిచిన తర్వాత జక్రాన్‌పల్లిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జక్రాన్ పల్లి మండలం అర్గుల్‌లో నిర్వహించిన మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. పసుపునకు రూ. 15వేల మద్దతు ధర, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం తమ కర్తవ్యమన్నారు. వరికి బోనస్ ఇస్తామన్నారు.

News April 15, 2024

సిద్దిపేట: 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో సిద్దిపేటలో ఈనెల 20 నుంచి సిద్దిపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానంలో నెల రోజులపాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్ తెలిపారు.

News April 15, 2024

మందమర్రి: అక్రమ వడ్డీ, ఫైనాన్స్‌లపై పోలీసుల దాడులు

image

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అక్రమ వడ్డీ వ్యాపారం, చిట్టీలు, ఫైనాన్స్ నిర్వాహకులపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. ఈ దాడులలో ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నడుపుతున్న స్థానిక విద్యానగర్‌కు చెందిన నస్పూరి వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసి అతను వద్ద నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

News April 15, 2024

HYD: పదో తరగతి బాలికపై అత్యాచారం

image

బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాదన్నపేటలోని చంద్రాహట్స్‌కు చెందిన రాజేందర్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పొక్సో కేసు నమోదు చేశారు.

News April 15, 2024

కడియంపై అనర్హత వేటు!.. స్టే.ఘలో ఉప ఎన్నిక?

image

మాజీ CM KCRను ఆదివారం రాత్రి మాజీ MLA రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా కడియంపై అనర్హత వేటు ఖాయమని KCR స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ఖాయమని, ఇందుకు BRS తరఫున రాజయ్య బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉండాలని KCR సూచించినట్లు సమాచారం. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల్లో కడియంను ఢీకొట్టేందుకు BRS వ్యూహం చేస్తోంది. ఇదివరకు కడియం, రాజయ్య ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారిమధ్య విభేదాలు ఉండేవి.