Telangana

News April 15, 2024

KNR: నిబంధనలు అతిక్రమించిన టీచర్ సస్పెండ్

image

నిబంధనలకు విరుద్ధంగా టెన్త్ మూల్యాంకన కేంద్రంలో ఫోన్ ఉపయోగించినందుకు ఓ టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన KNR జిల్లాలో చోటుచేసుకుంది. ఈమేరకు మానకొండూర్ మండలం పచ్చునూర్ జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, TPF జిల్లా అధ్యక్షుడు పి.దామోదరరెడ్డిని DEO జనార్దనరావు సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఉత్తర్వులను శనివారం రాత్రి ప్రధానోపాధ్యాయుడికి పంపినట్లు మూల్యాంకన కేంద్రం జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News April 15, 2024

HYD: పదో తరగతి బాలికపై అత్యాచారం

image

బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాదన్నపేటలోని చంద్రాహట్స్‌కు చెందిన రాజేందర్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పొక్సో కేసు నమోదు చేశారు.

News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి వార్షిక పరీక్షలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు,కేజీబీవీలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు,సీబీఎస్ఈ, మైనార్టీ గురుకుల, ఆదర్శ, మహాత్మ జ్యోతి బాపులే పాఠశాలల్లో సోమవారం నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 23న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల పురోగతి కార్డులను అందించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

News April 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓అశ్వారావుపేటలో BJP కార్యకర్తల సమావేశం

News April 15, 2024

MBNR: నేడు పీయూలో ఉద్యోగ మేళా

image

హైదరాబాద్ దివీస్ ల్యాబ్స్ సంస్థలో ట్రైనీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఈనెల 15న పాలమూరు విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రకిరణ్ తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎం-ఫార్మసీ, బీ-ఫార్మసీ, నాల్గో సెమిస్టర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 15, 2024

జనజాతర సభకు సర్వసిద్ధం.. భారీ బందోబస్తు

image

నేడు నారాయణపేటలో సీఎం రేవంత్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు SPలు, ఐదుగురు DSPలు, 25 మంది CIలు, 65 మంది SIలు, 75మంది హెడ్ కానిస్టేబులు, 415 మంది కానిస్టేబుళ్లు, గార్డులు, 50 మంది మహిళా పోలీసులు, రెండు రోప్ పార్టీలు, రెండు టీఎస్ఎస్పీ ప్లాటున్స్ , స్పెషల్ పార్టీ పోలీసులు, రెండు ఐటీబీపీ ప్లాటూన్స్‌లతో పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

News April 15, 2024

నారాయణపేటలో నేడు జన జాతర.. హాజరుకానున్న రేవంత్

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు నారాయణపేట వస్తున్నట్లు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ 2వసారి వస్తున్నారు. ఈ సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం వ్యవధిలోనే మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో రెండోసారి రేవంత్ రెడ్డి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

News April 15, 2024

మెదక్ జిల్లాలో పెరుగుతన్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు..!

image

మెదక్ జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో గతేడాది 73 మంది ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 120కి చేరింది. అయితే ఒక్క చేగుంట మండలంలోనే అత్యధిక బాధితులు ఉన్నారని, 18- 20 మంది మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న మండలాల్లో తాగునీటిని ల్యాబ్‌కు పంపి చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.

News April 15, 2024

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్న తారక్‌నంద

image

భువనగిరి పట్టణంలోని డాక్టర్‌ చావా రాజ్‌కుమార్‌ కుమారుడు చావా తారక్‌నంద ప్రతిభ చాటి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. శనివారం దిల్లీలోని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పోటీల్లో అతి తక్కవ సమయం 42 సెకండ్లలో ప్రపంచంలోని 100 దేశాల రాజధానుల పేర్లను ఏకధాటిగా చెప్పాడు. దీంతో రికార్డు తన సొంతం చేసుకున్నాడు.

News April 15, 2024

NZB: బీజేపీలో చేరిన తొలి ఉద్యమకారుడు

image

తెలంగాణ తొలి ఉద్యమకారుడు అతిమాముల రమేష్ గుప్తా ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు, ఇటీవల BRSకి రాజీనామా చేసిన రమేష్ గుప్తా, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే KVR, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, యెండల లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.