Telangana

News April 14, 2024

ADB: గోడం నగేశ్ రేపటి పర్యటన వివరాలు

image

ఆదిలాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ సోమవారం పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్‌లోని పటేల్ గార్డెన్‌లో నిర్వహించే బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో  ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.

News April 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో TOP NEWS

image

➤ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
➤కోనరావుపేట: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
➤ఓదెల: పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
➤జగిత్యాలలో వైభవంగా పడిపూజ
➤మెట్పల్లి పట్టణంలో కిలోన్నర బంగారం, ఏడు లక్షల నగదు సీజ్
➤భీమారం మండలంలో రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం
➤సిరికొండలో వైభవంగా జింక మల్లన్న జాతర

News April 14, 2024

సంగారెడ్డి: BRS హయాంలో నిర్బంధాలకు గురయ్యాం: మంత్రి కొండా సురేఖ

image

తాను ఎవ్వరికీ భయపడేది లేదని, భయపడితే రాజకీయం చేయలేమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ జగ్గారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అక్రమ కేసులు నమోదై జైలుకు వెళ్లామన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలకు గురయ్యామని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.

News April 14, 2024

‘ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి సెలవులు రద్దు’

image

రానున్న లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సెలువులు కోరితే ఇవ్వవద్దని గతంలో పెట్టుకున్న సెలవులను రద్దు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తమకు సెలవులు కావాలని కోరుతున్నారని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎటువంటి సెలవలు మంజూరు చెయ్యొద్దని అన్ని శాఖల అధికారులకు తెలియజేశారు.

News April 14, 2024

HYDలో అంబేడ్కర్‌కు అవమానం: గంటా చక్రపాణి

image

డా.బీఆర్‌ అంబేడ్కర్ జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందని TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, BRS సోషల్ మీడియా నేత చందు షేక్స్ విమర్శించారు. సచివాలయం పక్కనే ఉన్న భారీ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించలేదని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఇలాంటి ప్రతీకారాలు రాజకీయాల్లో ఒకే, కానీ రాజ్యాంగ ప్రాధాత, జాతిపితతో వద్దు అంటూ గంటా చక్రపాణి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

News April 14, 2024

HYDలో అంబేడ్కర్‌కు అవమానం: గంటా చక్రపాణి

image

డా.బీఆర్‌ అంబేడ్కర్ జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందని TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, BRS సోషల్ మీడియా నేత చందు షేక్స్ విమర్శించారు. సచివాలయం పక్కనే ఉన్న భారీ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించలేదని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఇలాంటి ప్రతీకారాలు రాజకీయాల్లో ఒకే, కానీ రాజ్యాంగ ప్రాధాత, జాతిపితతో వద్దు అంటూ గంటా చక్రపాణి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

News April 14, 2024

మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మృతి

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నక్కవార్ లక్ష్మణ్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

News April 14, 2024

MBNR: అడుగంటిన భూగర్భ జలాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాల్లో సాగు, తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జూరాల ప్రాజెక్ట్ పక్కనే ఉన్న ధరూర్ మండలంలోనూ ఫిబ్రవరిలో 26.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు మార్చిలో 39.19 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఒక్క నెలలోనే 12.35 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా, మదనాపురం మండలంలో మాత్రం భూగర్భ జలాలు కొంతమేరకు పైకి వచ్చాయి.

News April 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
✏CONGRESS,BJPలో భారీ చేరికలు
✏బీజేపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు:మల్లురవి
✏విద్యతోనే పేదరికాన్ని జయించాలి: మంత్రి జూపల్లి
✏NRPT:CM రేవంత్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
✏GDWL:రైలు ఢీకొని మహిళ మృతి
✏ఉమ్మడి పాలమూరులో ‘SUMMER CRICKET’
✏నూతన ఓటు హక్కును నమోదు చేసుకోండి:EC
✏రేపు కోస్గి‌కి మాజీ మంత్రి హరీశ్ రావు రాక

News April 14, 2024

KNR: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని మనోవేదనకు గురై యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన కొంగర స్వప్న(29) పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఈనెల 12న పురుగుల మందు తాగింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తన తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.