Telangana

News September 9, 2024

MBNR: అక్రమాలపై ప్రత్యేక హైడ్రా ఫోకస్.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.

News September 9, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.14,500 ధర రాగా వండర్ హాట్(WH) మిర్చికి రూ.15,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

News September 9, 2024

21 ఏళ్ల తర్వాత HYD సీపీగా డీజీపీ ర్యాంక్ అధికారి

image

HYD పోలీస్ కమిషనర్‌గా మరోసారి నేడు CV ఆనంద్ (డీజీపీ ర్యాంక్ IPS) తన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాదిలో జరిగిన సీపీ మార్పుల్లో ఒకటి, నాలుగో స్థానాలు ఆయనవే. 2,3 స్థానాల్లో సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అంతేకాక 21 ఏళ్ల తర్వాత డీజీపీ స్థాయి అధికారిని HYD నగర పోలీస్ కమిషనర్‌గా నియమించడం ప్రత్యేక విషయం. నూతన సీపీకి నగర ప్రజలు X వేదికగా స్వాగతం పలికారు. 

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 26.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా 21.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 14.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా నవబ్‌పేటలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 9, 2024

HYD: వ్యాపార సంస్కరణల్లో తెలంగాణ అత్యుత్తమం: మంత్రి

image

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఈనెల 5న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల కమిషనర్ డా.జీ.మల్సూర్ అవార్డును అందుకున్నారని తెలిపారు. అత్యుత్తమ సాధకులు (టాప్ అచీవర్స్)గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు.

HYD: అర్హత ఉన్నా.. వంట గ్యాస్ సబ్సిడీ అందడంలేదు..!

image

అర్హత ఉన్నా పలువురికి వంట గ్యాస్ సబ్సిడీ అందడంలేదని ఆరోపిస్తున్నారు. జీరో బిల్లులకు అర్హత సాధించినా గ్యాస్ సబ్సిడీ ఎందుకు అందడం లేదని, కారణమేంటని గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్ HYD పరిధిలో 17 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో 7.4 లక్షల మందికే జీరో బిల్లు అమలవుతుండగా.. కేవలం 3 లక్షల మందికే వంట గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.

ఆదిలాబాద్: DEGREEలో చేరేందుకు నేడే ఆఖరు

image

DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫెజ్ ద్వార ప్రవేశాలు పొందేందుకు నేడు చివరి తేదీ అని ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత పేర్కొన్నారు. SEP 9 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్ పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.