Telangana

News April 14, 2024

HYD: హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు!

image

HYD హిమాయత్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 2.128 టీఎంసీలు ఉండగా.. నగరానికి 26 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం అడుగులో కలుషితాలు పేరుకుపోవడంతో 10 అడుగులపై నుంచి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. పంపింగ్ ద్వారా నేరుగా మీర్ ఆలం నీటి శుద్ధి కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేయనున్నారు. హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు వస్తున్నట్లు గుర్తించారు.

News April 14, 2024

HYD: హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు!

image

HYD హిమాయత్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 2.128 టీఎంసీలు ఉండగా.. నగరానికి 26 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం అడుగులో కలుషితాలు పేరుకుపోవడంతో 10 అడుగులపై నుంచి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. పంపింగ్ ద్వారా నేరుగా మీర్ ఆలం నీటి శుద్ధి కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేయనున్నారు. హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు వస్తున్నట్లు గుర్తించారు.

News April 14, 2024

ఖమ్మం: బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

image

10 ఏళ్లు అధికారంలో ఉండి సెక్రటేరియట్‌కు రాకుండా ప్రజలను కలవకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గత బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు రంగాన్ని గందరగోళంలోకి నెట్టేసి, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు.

News April 14, 2024

పాలమూరులో విమర్శల వార్

image

పాలమూరులోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. BRS, కాంగ్రెస్‌, BJP అభ్యర్థులు మాటలతూటాలు పేలుస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలకు తెరలేపారు.10ఏళ్లలో పాలమూరుకు హోదా ఎందుకు తేలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం 6గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. 10ఏళ్ల క్రితం.. పాలమూరు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా మారిందో గమనించాలని బీఆర్ఎస్ అంటోంది.

News April 14, 2024

HYD: EMERGENCY పంపింగ్‌కు చర్యలు

image

HYDలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఈనెల 15 నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్ మెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.

News April 14, 2024

HYD: EMERGENCY పంపింగ్‌కు చర్యలు

image

HYDలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఈనెల 15 నుంచి ఎమెర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్ మెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.

News April 14, 2024

అంబేడ్కర్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన NZB అర్బన్ ఎమ్మెల్యే

image

అంబేడ్కర్ సాక్షిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్బంగా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..  అంబేడ్కర్ ఎన్నికల్లో పోటీచేస్తే ఆయన్ని కుతంత్రాలతో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాగే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసింది బీఆర్ఎస్ అని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

News April 14, 2024

వరంగల్: రేపు గడువు చివరి తేదీ

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 14, 2024

రెబ్బెన: కుక్కల దాడిలో జింక మృతి

image

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామ శివారులో ఆదివారం కుక్కల దాడిలో జింక దుప్పి మృతి చెందింది. గమనించిన వాహనదారులు గ్రామస్థులకు తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజలు జింక మృతదేహాన్ని పరిశీలించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.

News April 14, 2024

సిద్దిపేట: దేశ సేవలో ఆ గ్రామ యువకులు

image

యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మర్కూక్‌ మండలం గంగాపూర్‌కు రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్‌పుత్‌’లతో గంగాపూర్‌గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.