Telangana

News April 14, 2024

MBNR: 17 మండలాల్లో ప్రమాద ఘంటికలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండల తీవ్రతతో రోజురోజుకు భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో వరి పొలాలు, కూరగాయలు నీరు అందక ఎండిపోతున్నాయి. 17 మండలాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వెల్దండ, ధరూర్, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, ధన్వాడ,హన్వాడ, గండీడ్, మానవపాడు, కేటిదొడ్డి, నవాబుపేట, గుండుమాల్, కల్వకుర్తి, కోయిలకొండ, కొత్తకోట, NGKL, మదనాపూర్ మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని రాజేంద్ర కుమార్ తెలిపారు.

News April 14, 2024

HYD: ఈనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని, మే 2 వరకు జరుగుతాయని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి HYDలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో సెషన్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 14, 2024

HYD: ఈనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని, మే 2 వరకు జరుగుతాయని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి HYDలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో సెషన్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 14, 2024

ఉమ్మడి పాలమూరులో ‘SUMMER CRICKET’

image

క్రికెట్ ప్లేయర్లకు HCA శుభవార్త చెప్పింది. ఈనెల 20న ఉమ్మడి పాలమూరులో సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని సంస్థ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివరాలు: MBNR:9440057849, GDWL:9885955633, NGKL:9885401701.
SHARE IT

News April 14, 2024

KZR: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాన్

image

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్ లో సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

బోధన్ చక్కెర కర్మాగారం తెరిపిస్తా: జీవన్ రెడ్డి

image

రానున్న లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నవీపేటలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిస్తే మెుదటగా బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని అన్నారు. బీదర్ -బోధన్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృష్ చేస్తామని ప్రకటించారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు క్వింటాకు రూ. 15 వేల మద్దతు ధర కల్పిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.

News April 14, 2024

ఖమ్మం: అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చింతూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ సుకుమామిడి మండల పరిషత్ యూపీ పాఠశాల ఉపాధ్యాయుడు కనకారావు(59) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు.

News April 14, 2024

నకిరేకల్: కోడ్ ఉల్లంఘనపై సి-విజిల్‌లో ఫిర్యాదు

image

నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో బస్ షెల్టర్‌పై మాజీ ప్రజాప్రతినిధి పేరు కనిపించే విధంగా పెద్ద బోర్డు నేటికి అలాగే ఉందని, పంచాయతీ అధికారులు కోడ్ అమలులో శ్రద్ధ చూపడం లేదని శనివారం గ్రామస్థులు కోడ్ ఉల్లంఘనల కింద ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అసెంబ్లీ నియోజకవర్గ ఏఆర్వో కార్యాలయం సువిధ విభాగం అధికారులు వెంటనే స్పందించారు.

News April 14, 2024

వరంగల్: చోరీ చేసిన చర్చి పాస్టర్

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పరావుపేటలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంఖానిపేటకు చెందిన దంతాల రవి అప్పలరావుపేటలో చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. రోజూ చర్చికి వెళ్లే వీరభద్రరావుకు రవికి పరిచయం ఏర్పడింది. దీంతో రవి.. వీరభద్రరావు ఇంట్లో లేని సమయంలో 6 తులాల బంగారం, రూ.60,200 చోరీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

News April 14, 2024

బీఎస్పీ చేవెళ్ల అభ్యర్థిగా మీర్ మహమ్మద్ అలీ..?

image

చేవెళ్ల లోక్‌సభ బరిలో ఉండాలని బీఎస్పీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు, ముస్లిం మైనార్టీ నాయకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పరిగికి చెందిన మీర్ మహమ్మద్ అలీ ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనతో చర్చలు జరిపిన BSP నేతలు త్వరలో నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.