Telangana

News April 14, 2024

HYD: ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు

image

అర్హులైన యువతీ, యువకులు ఓటుహక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉందని HYDలో అధికారులు తెలిపారు. అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 15 వరకు అవకాశం ఉందని, గ్రామ స్థాయిలో VLO, మండల స్థాయిలో తహశీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో గడువులోగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో కూడా పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 14, 2024

సిద్దిపేట: ఓటు నమోదుకు మరో రెండు రోజులే ఛాన్స్

image

ఓటు నమోదుకు మరో రెండు రోజులే గడువు ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులందరూ ఈనెల 15లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి 8న లోక్‌సభ ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. సిద్దిపేట జిల్లాలో 9,61,361 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే జిల్లాలో 5 వేలకు పైగా ఫాం-6 దరఖాస్తులు వచ్చినట్లు అదికారులు తెలిపారు.

News April 14, 2024

HYD: ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు

image

అర్హులైన యువతీ, యువకులు ఓటుహక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉందని HYDలో అధికారులు తెలిపారు. అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 15 వరకు అవకాశం ఉందని, గ్రామ స్థాయిలో VLO, మండల స్థాయిలో తహశీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో గడువులోగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో కూడా పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 14, 2024

సిరిసిల్ల: తాటి చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

image

తాటి చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది.  గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమారి దేవయ్య ముంజలు కోయడానికి ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు.  ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

గురుకుల డిగ్రీలో ప్రవేశాలకు గడువు పెంపు

image

MJP బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పెంచినట్లు బీసీ గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అర్హులని, ఈనెల 28న ఉదయం 10 గం. ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News April 14, 2024

ఆదిలాబాద్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివ‌రాలు:
ఆదిలాబాద్: 94402 07473
మంచిర్యాల: 94400 10696
సిర్పూర్: 94923 33333

News April 14, 2024

ఉదయాన్నే ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండల శివారులో బైక్‌ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

నేడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

News April 14, 2024

NLG: ఓటు నమోదుకు రెండు రోజులే అవకాశం!

image

ఓటరు నమోదుకు ఈనెల 15 వరకే అవకాశం ఉంది. లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటు జాబితాలో పేరు ఉండాలి. అయితే 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు హక్కు పొందని వారు వెంటనే నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత ఉన్నా.. ఓటు రాదని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి రాకుండా ముందస్తుగా తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, బీఎల్వోల వద్ద జాబితా చూసుకోవాలని సూచించారు.

News April 14, 2024

హైదరాబాద్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HCA శుభవార్త చెప్పింది. ఈనెల 20న HYDలో సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని సంస్థ ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌ రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివ‌రాలు: హైద‌రాబాద్‌: జింఖానా: 90301 30346 ఫ‌ల‌క్‌నుమా: 98852 95387 అంబ‌ర్‌పేట్: 98665 82836 లాలాపేట్: 99664 62667 మాదాపూర్‌: 80195 35679 SHARE IT