Telangana

News April 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు వనపర్తికి కామారెడ్డి ఎమ్మెల్యే రాక
✔నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
✔మక్తల్: అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
✔ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు..APPLY చేసుకోండి
✔పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
✔నేడు PUలో జాబ్ మేళా
✔సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
✔నేడు పాలమూరుకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

News April 14, 2024

15న ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపిక

image

మహబూబ్ నగర్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపికను ఈ నెల 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేపడుతున్నట్లు సంఘం కార్యదర్శి భానుకిరణ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వరకు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 14, 2024

నల్గొండ జిల్లాకు దక్కిన మరో అరుదైన ఘనత!

image

నల్గొండ జిల్లాకు మరో అరుదైన ఘనత దక్కింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డీఎస్వో వెంకటేశ్వర్లు, డీసీవో కిరణ్ కుమార్, అధికారి నాగేశ్వర్‌రావుతో కలిసి అదనపు కలెక్టర్ శనివారం కొత్తపల్లి, కేశరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే 77,785 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

News April 14, 2024

నిజామాబాద్ జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి

image

మక్లూర్ మండలం ఒడ్యాట్‌పల్లిలోని చెరువులోకి ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తమతో సరదగా గడిపిన స్నేహితులు కళ్ల ముందే మృత్యుఒడికి చేరడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి (19), మహేశ్(19), నరేశ్ (18) మృతితో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలి వద్ద బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వారిని ఆపడం ఎవరితరం కాలేదు.

News April 14, 2024

విజయవాడ-భద్రాచలం రోడ్డు, రైలు పునఃప్రారంభం

image

విజయవాడ- భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం), భద్రాచలం రోడ్డు- విజయవాడ మధ్య ప్యాసింజర్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం పునఃప్రారంభించారు. ఈ రైళ్లను 21 వరకు నడిపిస్తామని ప్రకటించారు. విజయవాడలో మొదలుకానున్న ప్యాసింజర్‌ రైలు ఖమ్మం, డోర్నకల్‌, కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వరకు నడుస్తుంది. తిరిగి కొత్తగూడెంలో మొదలై ఇదే మార్గం ద్వారా విజయవాడ చేరుకుంటుంది.

News April 14, 2024

NGKL: ఒకేరాత్రి 10 ఇళ్లలో చోరీ

image

వెల్దండ మండలంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి చెర్కూర్ గ్రామంలో ఏకంగా 10 ఇళ్లల్లో చోరీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల నగదు, తులంన్నర బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ రవి గ్రామాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.

News April 14, 2024

నేడు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కేర్ 133వ జయంతి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండలాల ప్రజాప్రతినిధులు, పాల్గొని అంబేద్కర్ గ్రహానికి నివాళులర్పించారు. జిల్లాలోని పలు గ్రామాలలో అంబేద్కర్ ఉత్సవాల శోభయాత్ర నిర్వహించి డీజే పాటలకు నృత్యాలు చేయనున్నారు.

News April 14, 2024

నిర్మల్: పోలీస్ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

image

నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద శనివారం పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 13,50,000 నగదు పట్టుబడినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఎలాంటి నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

News April 14, 2024

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌పై కేసు నమోదు

image

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌పై మంథని పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 6న అంబేడ్కర్ కూడలిలో అనుమతి లేకుండా దీక్ష చేపట్టడంతో మధుకర్‌‌పై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు నోటీసులు జారీ చేశామన్నారు.

News April 14, 2024

HYD: సమ్మర్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా?

image

HYD నగరం నుంచి సమ్మర్ టూర్ వెళ్లాలనుకునే వారికి టూరిజం అధికారులు శుభవార్త తెలిపారు. 5 రోజుల టూర్లో భాగంగా అరకు ప్యాకేజీలో కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్ మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్ చూపించనున్నట్లుగా తెలిపారు. ఈ టూర్ వెళ్లేందుకు పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599 టికెట్ ధర ఉందని పేర్కొన్నారు.