Telangana

News April 14, 2024

80 మంది ఉద్యోగులకు నోటీసులు

image

దేవరకొండ పట్టణంలో ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన 80మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నెల 4, 6వ తేదీల్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా 80మంది గైర్హాజరయ్యారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యి వారికి నోటీసులు పంపారు. ఎందుకు హాజరు కాలేదో కారణం చెప్పాలన్నారు.

News April 14, 2024

HYD: సమ్మర్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా ..?

image

HYD నగరం నుంచి సమ్మర్ టూర్ వెళ్లాలనుకునే వారికి టూరిజం అధికారులు శుభవార్త తెలిపారు. 5 రోజుల టూర్లో భాగంగా అరకు ప్యాకేజీలో కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్ మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్ చూపించనున్నట్లుగా తెలిపారు. ఈ టూర్ వెళ్లేందుకు పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599 టికెట్ ధర ఉందని పేర్కొన్నారు. 

News April 14, 2024

HYD: ఊటికి వెళ్లొద్దామా..?

image

HYD నగరంలో ఎండలు బగ్గుమంటున్న వేళ ప్రజలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు,ఊటీ, మైసూర్ ప్యాకేజీని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల నిడివితో కూడిన ఈ టూర్లో టికెట్ ధర పెద్దలకు రూ.11,999, పిల్లలకు రూ.9,599 ఉందని, హోటల్ గదిలో ఒక్కరే ఉంటే టికెట్ ధరకు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

News April 14, 2024

HYD: ఊటికి వెళ్లొద్దామా..?

image

HYD నగరంలో ఎండలు బగ్గుమంటున్న వేళ ప్రజలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు,ఊటీ, మైసూర్ ప్యాకేజీని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల నిడివితో కూడిన ఈ టూర్లో టికెట్ ధర పెద్దలకు రూ.11,999, పిల్లలకు రూ.9,599 ఉందని, హోటల్ గదిలో ఒక్కరే ఉంటే టికెట్ ధరకు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

News April 14, 2024

మెదక్: నన్ను ఎదుర్కోలేకే నాపై తప్పుడు వార్తలు: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి

image

“నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులిచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ది పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గుచేటు” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి ఫైరయ్యారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమేనని వ్యాఖ్యానించారు.

News April 14, 2024

వరంగల్: కాకతీయుల సమాచారం.. క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం

image

కాకతీయుల కట్టడాలున్న ఖిలా వరంగల్ కోట సమాచారంతో పాటు కాకతీయుల చరిత్రను పర్యాటకులకు డిజిటల్ విధానంలో అందించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు కాకతీయుల చరిత్రను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి బోర్డులను ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో కట్టడాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

News April 14, 2024

NLG: పరీక్షలకు వేళాయే

image

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 22 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు జరుగనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యుల్‌‌లో మార్పులు చేసి ఉదయం పూటనే అన్ని పరీక్షలు నిర్వయించేందుకు టైం టేబుల్ రిలీజ్ చేశారు. జిల్లాలోని ప్రభువ్వ, ప్రైవేట్, గురుకులాలకు సంబంధించి 1,527 పాఠశాలకు పరీక్షలు కొనసాగుతున్నాయి. వీటిలో 1,19,030 మంది విద్యార్థలు చదువుతున్నారు.

News April 14, 2024

MBNR: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

image

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News April 14, 2024

MNCL: ఆర్ఎంపీ, పీఎంపీలు పరిమితి మించి వైద్యం చేయరాదు: DMHO

image

మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్బరాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమచికిత్స కేంద్రం అని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి బెడ్స్, శాంపిల్స్ మెడిసిన్ ఉండవద్దన్నారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని, ఎలాంటి యాంటిబయాటిక్స్ వాడరాదని సూచించారు. నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

News April 14, 2024

HYD: శ్రీరాముడి శోభాయాత్రకు భారీ బందోబస్తు

image

శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే శ్రీరామ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం శోభాయాత్ర నిర్వహించే వివిధ ప్రాంతాలను ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏటా ఈ శోభాయాత్రలో వేలాది మంది పాల్గొంటారు.