Telangana

News April 13, 2024

HYDలో దారుణం.. కొడుకుని చంపిన తల్లి

image

హైదరాబాద్‌లో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉప్పల్‌ PS పరిధి రామంతాపూర్‌లో చిన్న కొడుకుతో కలిసి పెద్దకొడుకుని తల్లి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామాక్షిపురానికి చెందిన మురళి మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో వారిని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక తల్లి శోభ, తమ్ముడు మనోహర్ చీరతో గొంతు బిగించి చంపేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు వెల్లడించారు.

News April 13, 2024

ధర్మారం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో శనివారం ఉదయం ఓ కారు అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ కారులో ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయడిన వీరిని అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భర్త మహేశ్ మృతి చెందాడు.

News April 13, 2024

ఏపీలో ఎన్నికలు.. HYDలో TDP ప్రచారం!

image

టీడీపీ LBనగర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని BNరెడ్డినగర్ డివిజన్ ఇన్‌ఛార్జి గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో జరిపారు. ఉదయగిరి MLA అభ్యర్థి సురేశ్, TTDP అధికార ప్రతినిధి జోష్న హాజరయ్యారు. BNరెడ్డిలోని ఉదయగిరికి చెందిన TDP, NTR అభిమానులు సురేశ్‌కు ఓటు వేయాలని విజయ్ కోరారు. ఆయన గెలుపునకు కృషి చేయాలన్నారు. హర్షత్ నాయుడు, నాగేశ్వరరావు, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు కార్పెంటర్ శీను పాల్గొన్నారు.

News April 13, 2024

పాలేరు ప్రజల సమస్యల కోసం నూతన ఒరవడి: మంత్రి పొంగులేటి

image

తనను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన పాలేరు ప్రజల కోసం అనునిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. నాలుగు మండలాలకు ఇద్దరు వ్యక్తి గత సిబ్బందిని నియమించుకుని వారి కోసం ఓ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేస్తానని ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులతో పొంగులేటి మాట్లాడారు.

News April 13, 2024

ఏపీలో ఎన్నికలు.. HYDలో TDP ప్రచారం!

image

టీడీపీ LBనగర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని BNరెడ్డినగర్ డివిజన్ ఇన్‌ఛార్జి గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో జరిపారు. ఉదయగిరి MLA అభ్యర్థి సురేశ్, TTDP అధికార ప్రతినిధి జోష్న హాజరయ్యారు. BNరెడ్డిలోని ఉదయగిరికి చెందిన TDP, NTR అభిమానులు సురేశ్‌కు ఓటు వేయాలని విజయ్ కోరారు. ఆయన గెలుపునకు కృషి చేయాలన్నారు. హర్షత్ నాయుడు, నాగేశ్వరరావు, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు కార్పెంటర్ శీను పాల్గొన్నారు.

News April 13, 2024

మహబూబ్ నగర్ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

చైత్రమాసం వసంత రుతువు, ఏప్రిల్ 22 పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం తెలిపారు. ఈనెల 21 సాయంత్రం 5 గంటలకు MBNR డిపో నుండి బస్సు బయలుదేరి ఏపీలోని కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, 22న సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 94411 62588, 73828 27102 సంప్రదించాలన్నారు.

News April 13, 2024

సంగారెడ్డి: రేవంత్ రెడ్డి.. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా?: హరీశ్ రావు

image

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి‌లోని గార్డెన్‌లో నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏం లేదని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

News April 13, 2024

నిజాంసాగర్: పల్టీకొట్టిన కారు

image

నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావు పల్లి జాతీయ రహదారిలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దెగ్లూర్ పట్టణానికి చెందిన ఫిజొద్దీన్ (22), అబ్దుల్ రజాక్ (22)కు గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వారిని హైవే అంబులెన్స్‌లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. 

News April 13, 2024

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

image

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు యాదగిరిగుట్ట పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని.. దీంతో భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..

News April 13, 2024

ఈనెల 15న నర్సంపేటలో సదరం క్యాంపు

image

ఈనెల 15న నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వరం ఏపీడీ పరగల్ జిల్లా పెన్షన్ల విభాగంమాత్మ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సంపేట డివిజన్‌కు చెందిన చెవిటి, లోకో మోటార్, ఓహెచ్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్న వారు హాజరుకావాలన్నారు. ఈనెల 15న క్యాంపు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్ లో వర్ధన్నపేట అని ఉన్నప్పటికీ నర్సంపేటలో జరిగే క్యాంపుకు రావాలని సూచించారు.