Telangana

News April 13, 2024

HSNB: కొనుగోలు కేంద్రంలో కార్ల పార్కింగ్

image

హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ షెడ్‌లో కార్ల పార్కింగ్ చేస్తున్నారని తెలిసింది. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు షెడ్డులో ధాన్యం పోసుకుందామంటే షెడ్‌లో కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయని, మార్కెట్ సిబ్బంది తీరు చూస్తేనే వారి పనితీరు తెలుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. కూతవేటు దూరంలో మంత్రి కార్యాలయం ఉండగా.. రైతులను పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన చెందుతున్నారు.

News April 13, 2024

MBNR: పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి

image

పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం లోని వివిధ మండలాలలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు.

News April 13, 2024

చింతమడకకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం

image

చింత‌మ‌డ‌క‌లో ఈ నెల 17న శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. సీతారాముల క‌ళ్యాణ మ‌హోత్స‌వ వేడుక‌కు హాజ‌రుకావాల‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత క‌ల్వ‌కుంట్ల వంశీధ‌ర్ రావు మాజీ సీఎం కేసీఆర్ దంప‌తుల‌ను ఆహ్వానించారు. శనివారం ఆహ్వాన ప‌త్రాన్ని కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో చింత‌మ‌డ‌క గ్రామ పెద్ద‌లు రామాగౌడ్, హంస కేతన్‌‌‌‌రెడ్డి, పోశయ్య, సత్యనారాయణ గౌడ్, శేఖర్, ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఉన్నారు.

News April 13, 2024

ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు

image

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. గోదూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం వద్ద రూ.8,33,000 విలువ గల ప్రామిసరీ నోట్లను, బ్లాంక్ చెక్కులను, నోటుబుక్కులను, సత్యక్కపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్ వద్ద రూ.38,14,370 విలువ గల ప్రామిసరీ నోట్లు, నోటుబుక్కులు, నగదును సీజ్ చేసి కేసు చేశామన్నారు.

News April 13, 2024

MBNR: మోదీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ

image

నరేంద్ర మోదీని తెలంగాణ ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం కొత్తకోట మండల కేంద్రంలో, మదనాపురం, అడ్డాకల్ మండలాల బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకుంటే ప్రజలు మోసపోతారని ధ్వజమెత్తారు.

News April 13, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ పోరాటాలపై కొనసాగిస్తున్న హత్యకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పిట్టపడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు చేసిన ఏకపక్ష దాడిని ఖండించాలంటూ.. ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు.

News April 13, 2024

భూపాలపల్లి: కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

image

కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం(కేటీపీపీ) చెల్పూర్లోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో బాయిలర్ ట్యూబ్లో లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. లీకేజీలోని సాంకేతిక కారణాలను మరమ్మతుకు 24 గంటల సమయం పడుతుందని తెలిపారు.

News April 13, 2024

నిజామాబాద్ జిల్లాలో విషాదం

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ ఘటన మాక్లూరు మండలం ఒడ్యాట్‌పల్లిలో జరిగింది. మృతిచెందిన వారు తిరుపతి, మహేశ్, నవీన్‌గా గుర్తించారు. ప్రమాదం నుంచి మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

ఖమ్మం: జంకుతున్న అటవీ అధికారులు

image

చంద్రాయపాలెం ఘటనతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆయుధాలు, ప్రత్యేక సిబ్బంది ఉన్న పోలీసులపైనే దాడి జరగటంతో ఆయుధాలు లేని తమపై దాడిని తిప్పికొట్టలేమంటూ అటవీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో అటవీశాఖ సిబ్బందిపై దాడి జరిగింది. అప్పటి నుంచి పోలీసుల సహకారం లేకుండా అటవీశాఖాధికారులు పోడు వివాదం జోలికి వెళ్లాలంటే జంకుతున్నారు.

News April 13, 2024

రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సుంకరి మొగ్గయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో క్యాబ్లో వెళుతుండగా క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్తతో ముందున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మొగ్గయ్యగూడెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.