Telangana

News April 13, 2024

సంగారెడ్డిలో బీజేపీకి షాక్..

image

ఎన్నికల వేళ బీజేపీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జీ, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. నేడు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోకాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.

News April 13, 2024

నిజామాబాద్: 30 తులాల బంగారం చోరీ

image

నిజామాబాద్‌లో నిన్న అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కిటికీ తొలగించి ఇంట్లో చొరబడిన దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబీకులు ఇంట్లోనే ఉండడం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఓ పడక గదిలో నిద్రించగా.. మరో గదిలోని కిటికీని ధ్వంసం చేసి 30తులాలకు పైగా బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షలు నగదు చోరీకి గురైంది.

News April 13, 2024

దౌల్తాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండు దొందు దొందే: హరీశ్ రావు

image

కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు దొందు దొందేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దౌల్తాబాద్‌లో మెదక్ పార్లమెంట్ సన్నాహాక సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ మాయ మాటలు దుబ్బాక ప్రజలకు తెలుసని చెప్పారు. మెదక్ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలిపారు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

News April 13, 2024

WGL: నేను పార్టీ మారట్లేదు: మాజీ ఎమ్మెల్యే

image

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ MLA నన్నపునేని నరేందర్ స్పందించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాపై గత కొన్ని రోజులుగా వచ్చే దుష్ర్పచారాలను నమ్మకండి. నేను BRSలోనే ఉన్నా. నాపై కావాలనే కొందరు కుట్ర పన్ని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. BJPలో చేరేది లేదు.. BRSలోనే కొనసాగుతా’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

News April 13, 2024

జహీరాబాద్: పల్లెల్లో ఎన్నికల సందడి.. పార్టీలపై చర్చ..!

image

పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. రచ్చబండ వేదికగా గ్రామాల్లోని పెద్దమనుషులు పార్టీల పనితీరు బేరీజు వేస్తూ ఓట్లు ఎవరికి వేయాలో చర్చించుకునే పనిలో పడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలావరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో మేజర్ పంచాయతీలపై పార్టీల అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ఇప్పటి నుంచే  మంతనాలు చేస్తున్నారు.

News April 13, 2024

పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి: కావ్య

image

పదేళ్ల తమ బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని, వారికి ఓటు వేస్తే నష్టపోయేది ప్రజలే అన్నారు. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్ళీ కష్టాలు తప్పవని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు.

News April 13, 2024

మక్తల్: కాంగ్రెస్ పార్టీలో చేరిన జలందర్ రెడ్డి

image

మక్తల్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలందర్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. 2 సార్లు మక్తల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జలందర్ రెడ్డి నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ఏర్పాటు చేసుకొని బలమైన నేతగా ఉన్న ఆయన పార్టీ మారడం బీజేపికి దెబ్బె అని పలువురు అంటున్నారు. వంశీచంద్ రెడ్డి, జితెందర్ రెడ్డి పాల్గొన్నారు.

News April 13, 2024

కొల్చారం: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఇసుక మాఫియా దాడి !

image

కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్ గ్రామ కొంగోడు శివారులోని హల్దీ వాగులో గ్రామానికి చెందిన కొంత మంది మాఫియాగా ఏర్పడి రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ తిరుమలేశ్ అధ్వర్యంలో వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఇసుక మాఫీయాలో కొంత మంది పోలీసులపై దాడి చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో దాడి చేసి రాజు, నవీన్ మరి కొందరిపై కొల్చారం PSలో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

News April 13, 2024

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్షయ్ మృతి

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బానోత్ అక్షయ్ మృతి చెందారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే ఆయన తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

News April 13, 2024

KMM: రక్తంతో ‘గుమ్మడి’ చిత్రపటం

image

ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య చిత్రపటాన్ని తన రక్తంలో గీయించి ఫ్రేమ్ కట్టిచాడు ఓ వీరాభిమాని. సెలబ్రేటీలకే వీభిమానులు ఉన్న ఈ రోజుల్లో 5సార్లు MLAగా చేసి నేటికీ సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడికి తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన వెంకటేశ్‌ వీరాభిమానిగా మారాడు. ఆ అభిమానంతోనే అలాంటి నేత కోసం తన రక్తంతో చిత్రపటం గీయించి ఆయన ఆదర్శాలను అందరికీ చాటిచెప్పాలని భావించినట్లు వెంకటేశ్‌ చెప్పారు.