Telangana

News April 13, 2024

SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చింతలపాలెం మండలం చింత్రియాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

NGKL: మందు తాగొద్దని చెప్పారని వృద్ధుడి ఆత్మహత్య

image

మద్యం తాగొద్దన్నందుకు ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI రాజశేఖర్‌ వివరాలు.. చారకొండ మండలం నూకలచింతవాడిక తండాకు చెందిన కేతవత్‌ లచ్చిరామ్‌నాయక్‌(62) మద్యానికి బానిసయ్యాడు. తరుచు ఇంట్లో గొడవ పడుతుండగా మందు తాగొద్దని కుటుంబీకులు వారించారు. దీంతో నిన్న ఉదయం పొలం వద్ద లచ్చిరామ్ పురుగు మందు తాగగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. ఈమేరకు కొడుకు శివలాల్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 13, 2024

NRPT: ‘కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి’

image

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలను కలిసికట్టుగా తిప్పి కొట్టాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశినాథ్ అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాలులో నిర్వహించిన జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడారు. కేంద్రం మతాల మధ్య చిచ్చులు పెట్టి ఘర్షణలు సృష్టిస్తోందని అన్నారు. కార్పోరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.

News April 13, 2024

ఖమ్మం: భార్యపై వేటకొడవలితో దాడి

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామంలో భార్యపై భర్త గొడ్డలి, వేట కొడవలితో శుక్రవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

పాలమూరు నుంచి ఎన్నికైన ఉత్తమ పార్లమెంటేరియన్

image

మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో పోటీ చేసిన సూదిని జైపాల్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. 1998లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున మహబూబ్‌‌నగర్ ఎంపీగా రెండో సారి ఆయన ఎన్నికయ్యారు. అదే ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారత ఎంపీ జైపాల్ రెడ్డి కావడం విశేషం. పలు మార్లు కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.

News April 13, 2024

ఈ మార్గాలలో రాత్రి రాకపోకలు బంద్

image

చింతూరు : మావోయిస్టు బంద్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజులపాటు చట్టి – భద్రాచలం, చట్టి – కుంట మార్గంలో రాత్రిపూట వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు స్థానిక ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 నుంచి 15 వరకు మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రెండు మార్గాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

News April 13, 2024

వేములవాడలో గంజాయి కలకలం

image

ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి వేములవాడలో విక్రయిస్తున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిందితుల వద్ద 1,900 గ్రాముల గంజాయి, ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య, సిబ్బంది ఉన్నారు.

News April 13, 2024

PU పరిధిలో ఎంఈడీ పరీక్ష రీషెడ్యూల్

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈనెల 16న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మహనీయుల జయంతి నేపథ్యంలో 16న జరిగే ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఉంటుందని విద్యార్థులు గమనించాలని కోరారు.

News April 13, 2024

NLG: అసెంబ్లీ వారీగా నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు

image

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈనెల 13 నుంచి 22 వరకు జరుగుతాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13న దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్నగర్, 21న సూర్యాపేట, 22న నాగార్జునసాగర్ నియోజకవర్గాల సమావేశాలు సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు.

News April 13, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం నమోదు

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉ. 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం.. అత్యధికంగా కంగ్టిలో 68.8 మి.మీ., మనూర్ 41.8, ముక్తాపూర్ 39.3, పెద్ద శంకరంపేట 33.5, నాగల్ గిద్ద 28.8, రేగోడు 26.0, కోహిర్ 11.5, బోడగాట్, మునిపల్లి 11.0, సిర్గాపూర్ 9.8, అల్లాదుర్గం 8.0, మొగుడంపల్లి 7.8, లింగాయపల్లి 7.3, చికోడ్ 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.