Telangana

News April 13, 2024

HYD: పెరగనున్న సిటీ బస్సులు!

image

గ్రేటర్‌ HYDలో బస్సుల సంఖ్య పెరుగుతోంది. 2,850 బస్సులతో ప్రధాన రూట్లకే పరిమితమైన RTC ఇప్పుడు పూర్వవైభవాన్ని చాటేందుకు సిద్ధమౌతోంది. గతంలో 3,850 బస్సులు HYD జోన్‌లో ఉండేవి. 2019లో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 1000 బస్సులను తగ్గించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.దీంతో జిల్లాల్లో తిరుగుతున్న డీలక్స్‌ బస్సులను నగరానికి తెచ్చి సిటీ బస్సులుగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

News April 13, 2024

ముత్తారం: రోడ్డు ప్రమాదం.. ఎస్ఐకి తప్పిన ప్రమాదం

image

ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్ఐ మధుసూదన్ రావుకు ప్రమాదం తప్పింది. కేశనపల్లి గ్రామం వైపు ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రాక్టర్ ఆర్టీసీ బస్సును దాటించే క్రమంలో ఎదురుగా గోదావరిఖనికి కారులో వెళ్తున్న ఎస్ఐ వాహనాన్ని ట్రాక్టర్ డ్రైవర్ చూసి సడన్ బ్రేకు వేశారు. ఈ క్రమంలో పోలీస్ వాహనం అద్దాలు పగిలాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

News April 13, 2024

SRPT: ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన జ్యోతి(25) HYDలో జాబ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ వీరబాబుతో 4ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరగా మొదట్లో అంగీకరించిన అతను నెలరోజులుగా కట్నం లేదా పొలం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఇంటికి వెళ్లిన యువతి మనస్తాపంలో ఉరేసుకుంది.

News April 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔MBNR:నేడు వామపక్షాల జిల్లా సదస్సు
✔దేవరకద్ర:నేటి నుంచి ఈశ్వర వీరప్పయ్య స్వామి ఉత్సవాలు ప్రారంభం
✔గండీడ్:VOA& ఉపాధ్యాయుల సమావేశం
✔NRPT:15న సీఎం రాక.. కొనసాగుతున్న ఏర్పాటు
✔కల్వకుర్తి:BRS కార్యకర్తల సమావేశం
✔కల్వకుర్తి:పలు మండలాలలో కాంగ్రెస్ కార్నర్ సమావేశాలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యేలు,MP అభ్యర్థులు
✔NRPT,GDWL:పలు గ్రామాలలో కరెంట్ కట్

News April 13, 2024

MBNR: ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన జ్యోతి(25) HYDలో జాబ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ వీరబాబుతో 4ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరగా మొదట్లో అంగీకరించిన అతను నెలరోజులుగా కట్నం లేదా పొలం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఇంటికి వచ్చిన యువతి మనస్తాపంలో ఉరేసుకుంది.

News April 13, 2024

అథ్లెటిక్స్‌ పోటీలకు రేపు క్రీడాకారుల ఎంపిక

image

పాల్వంచ: ఈనెల 28న సూర్యాపేటలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జిల్లా స్పోర్ట్‌ అథారిటీ మైదానంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.మహీధర్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 14, 16, 18, 20 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99636 59598ను సంప్రదించాలన్నారు.

News April 13, 2024

రామగుండం: గోదావరిలో దూకి డిగ్రీ విద్యార్థిని సూసైడ్

image

GDK హనుమాన్ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని అర్షియా పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ CI రవీందర్ తెలిపారు. డిగ్రీ చదువుతున్న అర్షియా శుక్రవారం నదిలోకి దూకిందన్నారు. జాలర్లు గమనించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారని, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

తల్లాడ: చికిత్స పొందుతూ యువతి మృతి

image

చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గూడూరు నవ్య (20) ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. కుటుంబ సభ్యులు నవ్యకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. తాను చదువుకోవాలని, పెళ్లి చేసుకోనని నవ్య చెప్పినా తల్లిదండ్రులు వినకపోవడంతో పురుగుమందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

News April 13, 2024

నిర్మల్: ఆ గ్రామంలో గుక్కెడు నీళ్లు కరువు

image

నిర్మల్ జిల్లా బైంసా మండలం బాబుల్ గావ్ గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్న కలెక్టర్ ఆదేశాలు కూడా
అధికారులు లెక్కచేయడం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామంలో నీటి సమస్య ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

News April 13, 2024

కొండపాక: దుద్దెడ చెరువు ప్రాంతంలో నెమళ్లు మృతి

image

కొండపాక మండలం దుద్దెడ నల్లచెరువు ప్రాంతంలో ఏడు నెమళ్లు మృతిచెందాయి. ఓ రైతు పశువులకు నీళ్లు పెట్టడానికి వెళ్తే నెమళ్లు అక్కడ పడి ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులకు రైతు సమాచారాన్ని అందజేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చందు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 7 చనిపోగా వాటిళ్లో ఓ నెమలి బతికి ఉందని గుర్తించి వెంటనే దుద్దెడ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. విషపు గుళికల వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.