Telangana

News April 13, 2024

NLG: ఆరు నెలలుగా చక్కర పంపిణీ బంద్!

image

ఉమ్మడి జిల్లాలో అంత్యోదయ కార్డుదారులకు చక్కెర అందడం లేదు. ఆరు నెలలుగా చక్కెర పంపిణీని నిలిపివేసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆహార భద్రత కార్డుదారులకు గతంలో బియ్యం, చక్కెర, గోధుమలతో సహా తొమ్మిది రకాల వస్తువులు సరఫరా అయ్యేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆహార భద్రత కార్డులకు బియ్యం, అంత్యోదయ కార్డులకు బియ్యంతో పాటు చక్కెర మాత్రమే ఇస్తూ మిగతా వాటికి కోత పెట్టింది.

News April 13, 2024

NGKL: పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

ఉమ్మడి జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. బల్మూర్ మండలం కొండనాగుల పెద్దగుడి బండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు అర్చకుడు విద్యాసాగర్ తెలిపారు. గతంలోనూ ఇక్కడ తవ్వకాలు జరిగాయని వీటిపై ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించి తవ్వకాలు జరిగాయని చెప్పారు.

News April 13, 2024

ఆదిలాబాద్: మరో మూడు రోజులే..!

image

ఉమ్మడి ADB జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గత ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ADB లోక్ సభ పరిధిలోని 2111 పోలింగ్ కేంద్రాలలో 16,44,715 మంది ఓటర్లకు చోటు దక్కగా.. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాలో 754 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,646 మంది ఓటర్లకు చోటు లభించింది. అయితే ఈ నెల 15 వరకు ఓటరు నమోదు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

News April 13, 2024

ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు సీతారాముల తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు (ఇంటింటికీ) అందిస్తున్నామని జనగామ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కొండం అవినాశ్ తెలిపారు. స్వామివారి తలంబ్రాలు కోరుకునే భక్తులు రూ.151తో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించాలని కోరారు.

News April 13, 2024

కరీంనగర్: సంతకాల ఫోర్జరీ.. జూనియర్ అసిస్టెంట్, ఆమె భర్తపై కేసు

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు బిల్లులు సృష్టించిన జూనియర్ అసిస్టెంట్ తిరుమల, ఆమె భర్త రాజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చంద్ర ప్రకాశ్ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చేరాలు పేర్కొన్నారు.

News April 13, 2024

ఎడపల్లి: రెండు కార్లు ఢీ, పలువురికి గాయాలు

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే గేటు వద్ద నిజామాబాద్- బోధన్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ధ్వంసమైన వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్టు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

News April 13, 2024

జిల్లాలో 2.36 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ 

image

ఖమ్మం జిల్లాలో గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.6.69 కోట్ల విలువైన విద్యుత్‌ను వినియోగదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు సంస్థ గుర్తించింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి వచ్చాక ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉండి, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌తో అనుసంధానమైన విద్యుత్‌ కనెక్షన్లకు ఉచిత పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.

News April 13, 2024

HYD: ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కోవర్టుల భయం!

image

పార్లమెంటు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కోవర్టుల భయం పట్టుకుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తమ బలంతో పాటు బలహీనతలు ప్రత్యర్థులకు చేరుతున్నాయనే అనుమానాలతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గోప్యత పాటించాల్సిన అంశాలను బయటకు పొక్కకుండా ఎలా చూడాలోనని ఆందోళన చెందుతున్నారు.

News April 13, 2024

HYD: ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కోవర్టుల భయం!

image

పార్లమెంటు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కోవర్టుల భయం పట్టుకుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తమ బలంతో పాటు బలహీనతలు ప్రత్యర్థులకు చేరుతున్నాయనే అనుమానాలతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గోప్యత పాటించాల్సిన అంశాలను బయటకు పొక్కకుండా ఎలా చూడాలోనని ఆందోళన చెందుతున్నారు.

News April 13, 2024

NZB: పక్షుల ప్రేమికుడు ఈ విశ్రాంత ఉద్యోగి

image

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. అన్న మదర్ థెరిస్సా వ్యాఖ్యలను అక్షరాల నిజం చేస్తున్నారు ఓ విశ్రాంత ఉద్యోగి. నిజామాబాద్ వినాయకనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి అందే జీవన్ రావ్ అంతరించిపోతున్న పక్షులను సంరక్షించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. తన ఇంట్లోనే ఆవాసాలు ఏర్పాటు చేశారు. వేరే ప్రాంతాల్లో పక్షులు వదిలిపెట్టిన గూళ్లను తీసుకొచ్చి.. తన ఇంట్లోని చెట్ల కొమ్మలకు ఏర్పాటు చేశారు.