Telangana

News April 13, 2024

ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్ రాక..!

image

ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇద్దామని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ నెల 16న కేటీఆర్ ఆదిలాబాద్ వస్తున్నారని, కార్యకర్తలు సకాలంలో హాజరై కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు. బోథ్ నియోజకవర్గంలోని 302 బూతుల నుంచి కార్యకర్తలు కష్టపడి 90 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలన్నారు.

News April 13, 2024

MBNR: డీకే అరుణ అసమర్థత నాయకురాలు: వంశీ చంద్‌రెడ్డి

image

బిజెపి ప్రభుత్వం కేంద్రంలో10 ఏళ్లు అధికారంలో ఉన్న డీకే అరుణ అసమర్థత వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు. కేశంపేటలో వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా ప్రజల అవసరాలను ఏనాడైనా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. అరుణ బంగ్లా రాజకీయాలు అహంకార ధోరణి ప్రజలకు తెలుసునని ఆమెను విమర్శించారు.

News April 13, 2024

HYD: SCR ఆధ్వర్యంలో 16 రైళ్ల సేవలు పొడగింపు

image

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుపుతున్న 16 ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు సికింద్రాబాద్ డివిజన్ SCR అధికారులు Xలో ప్రకటించారు. చెన్నై-సంత్రాగచ్చి, భువనేశ్వర్-చెన్నై, ఎర్నాకులం-బరంపూర్, బెంగళూరు-కలబురిగి, నాగర్‌సోల్-దిబ్రూగఢ్ తదితర స్టేషన్ల మధ్యనడుస్తున్న ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి జూన్ 15 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని వివరించారు.

News April 13, 2024

HYD: SCR ఆధ్వర్యంలో 16 రైళ్ల సేవలు పొడగింపు

image

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుపుతున్న 16 ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు సికింద్రాబాద్ డివిజన్ SCR అధికారులు Xలో ప్రకటించారు. చెన్నై-సంత్రాగచ్చి, భువనేశ్వర్-చెన్నై, ఎర్నాకులం-బరంపూర్, బెంగళూరు-కలబురిగి, నాగర్‌సోల్-దిబ్రూగఢ్ తదితర స్టేషన్ల మధ్యనడుస్తున్న ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి జూన్ 15 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని వివరించారు.

News April 13, 2024

కాంగ్రెస్ మోసాలు.. మన ప్రచార హస్త్రాలు: హరీష్ రావు

image

కాంగ్రెస్ మోసాలనే ప్రచార హస్త్రాలుగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ను ఎండగట్టారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎల్ఈడీ స్కిన్ పై పార్టీ శ్రేణులకు చూపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై నిలదీయాలన్నారు.

News April 13, 2024

ములుగు: బీజేపీకి బుద్ధి చెప్పాలి: సీతక్క

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. తన పర్యటనలో భాగంగా గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క కాసేపు డోలు వాయించి సందడి చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

News April 13, 2024

ఖమ్మం మెడికల్ కాలేజీ నిర్మాణంపై తుమ్మల సమీక్ష

image

ఖమ్మం మెడికల్ కాలేజి నిర్మాణం కాంట్రాక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీఅయ్యారు. తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్స్, ప్రొఫెసర్స్ క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్, క్రీడా మైదానం నిర్మాణం కేటాయించిన స్థల ప్రాంగణంలో ఏ బిల్డింగ్ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే విషయం త్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

News April 13, 2024

తప్పుడు అఫిడవిట్‌ను సమర్పిస్తే చర్యలు: SP

image

నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు, ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ను సమర్పిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ను సమర్పించడం, అఫిడవిట్‌లో కొంత సమాచారాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ను సమర్పించడం నేరంగా పరిగణించబడుతుందని ఎస్పీ వెల్లడించారు.

News April 12, 2024

NLG: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ప్రయాణీకులు కొన్నిసార్లు రైలు పైకప్పు, స్టెప్ (ఫుట్ బోర్డ్) మీద ప్రయాణిస్తున్నారని… రైలు పైకప్పు, మెట్టు లేదా ఇంజిన్ పై ప్రయాణించడం ప్రమాదకరం, సురక్షితం కాదు… చట్టవిరుద్ధమని గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల ఉపయోగం కోసం ఉద్దేశించబడని రైలు పైకప్పు, మెట్టు లేదా ఇంజిన్ పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.

News April 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ భీమదేవరపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి. @ మెట్పల్లి మండలంలో 2 బైకులు ఢీకొని ఇద్దరి మృతి. @ రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండల వాసి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్. @ బిజెపికి ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నా మంత్రి పొన్నం ప్రభాకర్. @ కరీంనగర్ లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాలలో చాయ్ పే చర్చలో పాల్గొన్న ఎంపీ అరవింద్