Telangana

News April 12, 2024

ఈనెల 18న హైదరాబాద్‌కు రాజ్ నాథ్ సింగ్

image

హైదరాబాద్‌లో రెండు రోజులు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఈనెల 18న హైదరాబాద్‌కు వచ్చి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 19న కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రచార సభలో పాల్గొని ఓట్లు అభ్యర్థిస్తారు .

News April 12, 2024

మెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా: సునీత లక్ష్మారెడ్డి

image

కౌడిపల్లిలో జరిగిన కౌడిపల్లి, చిలిపిచెడ్‌, కుల్చారం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. మెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, ఎవరు అడ్డొచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

News April 12, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యంశాలు

image

@MBNR:అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలి: వంశీ చందర్ రెడ్డి.
@ కొడంగల్: వైభవంగా శ్రీవారి చక్రస్నానం.
@ కోడేరులో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.
@ బిజినేపల్లి: చిరుత పులి దాడుల్లో లేగ దూడ మృతి.
@ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నాగర్కర్నూల్ కలెక్టర్.
@ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పరిధిలో ఎంపీ అభ్యర్థుల ప్రచారం.
@ అచ్చంపేట: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ సిఎస్.

News April 12, 2024

BREAKING.. HYD: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

మేడ్చల్ జిల్లా కాప్రా పరిధి సాయినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు అంతస్తుల భవనం దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఈసీఐఎల్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివాని(18) చనిపోయింది. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2024

BREAKING.. HYD: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

మేడ్చల్ జిల్లా కాప్రా పరిధి సాయినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు అంతస్తుల భవనం దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఈసీఐఎల్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివాని(18) చనిపోయింది. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏NGKL: కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతి
✏MBNR:అసత్య ప్రచారాలు తిప్పి కొట్టండి: చల్లా వంశీచంద్‌రెడ్డి
✏నరేంద్ర మోడీకి మరోసారి పట్టం కట్టాలి: భరత్ ప్రసాద్
✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
✏బిజినేపల్లి:చిరుత పులి దాడిలో మరో లేగదూడ మృతి
✏NGKL: పార్లమెంట్ ఎన్నికల శంఖం పూరించిన మల్లురవి
✏ఉమ్మడి జిల్లాలో నూతన ఓటర్ల పై అధికారుల ఫోకస్
✏NRPT: జనగర్జన సభ ఏర్పాట్లు పరిశీలించిన డిఎస్పీ

News April 12, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి క్రైమ్ న్యూస్

image

√ నాగర్ కర్నూల్: విద్యుత్ తగిలి ఇద్దరూ తోటి కోడళ్ళ మృతి.
√బొంరాస్ పేట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
√ కొడంగల్: మద్యం మత్తులో డ్రైవింగ్ ఒకరు మృతి.
√ ఉప్పునుంతల: పిడుగుపాటు గురై మహిళ మృతి.
√ నాగర్ కర్నూల్: 30 గ్రాముల గంజాయి పట్టివేత.
√ నారాయణపేట: అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.
√ కడ్తాల్: వివాహిత అదృశ్యం కేసు నమోదు.

News April 12, 2024

MBNR: కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

image

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు సుమారు నెల రోజుల సమయం ఉంది. కానీ, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో పోరు తారస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు హోరాహోరీ రణం నడుస్తోంది. ఇరుపార్టీల అభ్యర్థులు డీకే అరుణ, చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో పాలమూరు అట్టుడుకుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

News April 12, 2024

గాదిగూడలో రూ.4.50 లక్షల గంజాయి పట్టివేత

image

గాదిగూడ మండల పరిధిలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఉమ్మడి నార్నూర్ మండలంలో గత నాలుగు రోజుల్లో దాదాపు 18 కిలోలతో కూడిన సుమారు రూ.4.50 లక్షల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

News April 12, 2024

సంగారెడ్డిలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఐనవోలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మహేశ్, శ్రీనుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.