Telangana

News April 12, 2024

కామారెడ్డి: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మంటలు

image

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌ ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ స్కూటీపై ఓ వ్యక్తి వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూటీని నిలిపివేశారు. అనంతరం ఒక్కసారిగా స్కూటీలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

News April 12, 2024

ధాన్యం రైతులను ఇబ్బందుల గురిచేస్తే చర్యలు తప్పవు: ఎస్పీ  

image

 రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో తరుగుల పేరిట ఇబ్బందులకు గురి చేసిన, మద్దతు ధరకు కంటే తక్కువ చెల్లించిన మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఐకెపి, సొసైటీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయు రైస్ మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.

News April 12, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటుపై వీడని పీటముడి..?

image

ఎన్నికల షెడ్యూలు విడుదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో పీటమూడి వీడటం లేదు. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News April 12, 2024

MBNR: అసత్య ప్రచారాలు తిప్పి కొట్టండి: చల్లా వంశీచంద్‌రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కోయిలకొండ మండలం ఆచార్యపూర్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలపై నిజాలు ప్రజలకు వివరించాలని అన్నారు.

News April 12, 2024

సూర్యాపేట: 10 రోజులలో 12 మంది ‌మృతి

image

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఈ 10 రోజుల కాలంలో 12 మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈనెల 4న ఇద్దరు చిన్నారులు ,ఇద్దరు ఉపాధ్యాయినీలు, మరో వృద్ధురాలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈనెల 8న ఓ యువకుడు, ఈ నెల 10న ఓ యువకుడి, ఈనెల 11న ఆరుగురు యువకులు ఇదే జాతీయ రహదారి 65 మృతి చెందారు. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

News April 12, 2024

మెదక్‌లో వేడెక్కిన రాజకీయాలు

image

లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచార సమరానికి సమాయత్తమవుతున్నారు. మెదక్‌ సెగ్మెంట్‌లో BRS నుంచి MLC వెంకట్రామ్‌రెడ్డి, మాజీ MLA రఘునందన్‌ రావు (BJP), నీలం మధు (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను రాబట్టుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఈనెల 18 తర్వాత ప్రచారం హోరెత్తనుంది .

News April 12, 2024

NZB: మరో 4 రోజులే గడువు

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 12, 2024

MBNR: ఆన్లైన్ మోసం.. రూ.36లక్షలు స్వాహా !

image

ఆన్‌లైన్‌లో పరిచయమై ఓ వ్యక్తిని నమ్మించి తన ఖాతాలోంచి రూ.36 లక్షలు ఖాళీ చేసిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. SI చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సునీల్ జవహర్‌కు ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం కాగా.. గూగుల్ వ్యూస్స్ ఇస్తే డబ్బులు వస్తాయని దీని కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన అతను సునీల్ ఖాతా నుంచి రూ.36 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News April 12, 2024

విభజన హామీలు విస్మరించిన కేంద్ర ప్రభుత్వం: మంత్రి పొన్నం

image

బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా.. తెలంగాణ విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 14న కరీంనగర్లో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, ఓటు అడిగే నైతికహక్కు బీజేపీకీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్నారే తప్పా.. ప్రజలకు ఏమి చేయలేదన్నారు.

News April 12, 2024

రాములోరి కళ్యాణానికి జానకీ సదనం సిద్ధం..!

image

భద్రాచలంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం సౌమిత్రీ సదనం సమీపంలో రూ.3.6 కోట్లతో గ్రౌండ్‌ ప్లస్‌ 2పద్ధతిలో 34 గదులను నిర్మించారు. దీనికి జానకీ సదనం అని పేరు నిర్ణయించారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉండగా వీలైనంత తొందరగా పూర్తిచేసి 17న ప్రారంభించాలని సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సత్రాలకు తోడు ఇది అందుబాటులోకి వస్తే భక్తులకు వసతి సదుపాయం మెరుగుపడనుంది.