Telangana

News April 12, 2024

BSWD: ‘ఇవి చేసినప్పుడే మా గ్రామానికి ఓట్లకు రావాలని ఫ్లెక్సీ’

image

బాన్సువాడ నియోజకవర్గంలో నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. ‘దేశ భద్రత కోసం సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయాలి. హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలి. అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు రావాలి. గోవధ నిషేధ చట్టం అమలు జరపాలి’ అని అప్పుడే మా గ్రామానికి ఓట్లకు రావాలని ఫ్లెక్సీ పెట్టారు.

News April 12, 2024

చేవెళ్లలో BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి ZPTC

image

చేవెళ్ల మండల ZPTC మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి శుక్రవారం BRSను వీడారు. పామెన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MP అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నిర్ణయించుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా, రేపు KCR సభ ఉండగా ఒకరోజు ముందు కీలక నేత పార్టీ మారడం చర్చనీయాంశమైంది.

News April 12, 2024

NLG: ప్రతి భవనంలో ఇంకుడు గుంతలు తప్పని సరి

image

తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతలపై దృష్టి పెట్టింది. ఇటీవల హైకోర్టు సైతం ఇంకుడు గుంతలు తప్పని సరిగా తీయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో 350 గజాలు దాటిన ప్రతి భవనం, అపార్ట్మెంట్స్, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు వాణిజ్య సముదాయాల్లో తప్పని సరిగా ఇంకుడు గుంతలు తీయించాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులను ఆదేశించింది.

News April 12, 2024

చేవెళ్లలో BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి ZPTC

image

చేవెళ్ల మండల ZPTC మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి శుక్రవారం BRSను వీడారు. పామెన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MP అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నిర్ణయించుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా, రేపు KCR సభ ఉండగా ఒకరోజు ముందు కీలక నేత పార్టీ మారడం చర్చనీయాంశమైంది.

News April 12, 2024

KMM: విధులు నిర్వర్తించే చోటే ఓటు

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించే అవకాశముంది. దీంతో వీరికి మాత్రం గతంలో మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరైనా వస్తే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరు సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసే బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయాలి.

News April 12, 2024

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభం

image

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు.

News April 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.36.56 కోట్ల లబ్ధి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకొని వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీని వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33,471 స్వయం సహాయక సంఘాలకు రూ.36.56 కోట్ల లబ్ధి చేకూరింది. KNR రూ.11.34 కోట్లు, JGTL రూ.10.17 కోట్లు, SRCL రూ.8.23 కోట్లు, PDPL రూ.6.82 కోట్లు వడ్డీ జమ చేశారు.

News April 12, 2024

మంజీరా తీరంలో నెగ్గేదెవరో..?

image

2008లో ఏర్పడిన మంజీరా తీరంలో జహీరాబాద్‌ లోక్‌సభకు ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం KA, MH ఆనుకొని ఉండటంతో కన్నడ శైలి.. మరాఠీల ప్రత్యేకత చాటుతుంది. ఇక్కడ లింగాయత్‌, మరాఠా సామాజిక వర్గాలదే ఆధిపత్యం. 2009 ఎన్నికల్లో సురేశ్ షెట్కార్, 2014, 19లో బీబీ పాటిల్ గెలవగా.. ఇద్దరిది లింగాయత్ సామాజిక వర్గమే. ఈసారి వీరితోపాటు BRS అభ్యర్థిగా గాలి అనిల్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీల్లో నెగ్గేదెవరో వేచి చూడాల్సిందే.

News April 12, 2024

మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్ రావు

image

మెదక్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి రుద్రారంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగు లాగా ఉందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో, అంతే వేగంగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.

News April 12, 2024

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంపై అందరి గురి..!

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తున్నాయి. అంతేకాకుండా సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టాయి . ఇక్కడ గెలుపోటములు ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.