Telangana

News April 11, 2024

హన్మకొండ: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ క్రాస్ రోడ్ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. హన్మకొండ వైపు నుంచి పరకాల వైపు వెళ్తున్న కారు.. గూడెప్పాడు వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

MBNR: తగ్గిన జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం

image

కృష్ణాతీరంలోని ప్రధాన ప్రాజెక్టు జూరాల రిజర్వాయర్‌లో ఈసారి నీరు కూడా లేకుండా పూర్తిగా అడుగంటింది. ఈ సీజన్‌ మొదటి నుంచే కృష్ణాలో నీటి జాడ లేకపోవడంతో యాసంగిలో అధికారులు రైతులకు సాగునీరు అందించలేమని పంట విరామం (క్రాప్‌ హాలిడే) ప్రకటించారు. మొత్తం 9.657 టీఎంసీ సామర్థ్యం ఉన్న జూరాల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.44 టీఎంసీ నీటికి పరిమితమైంది. ఈ నీటిని ఎలాంటి అవసరాలకు వినియోగించలేని పరిస్థితి నెలకొంది.

News April 11, 2024

ఉమ్మడి జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

image

ఉమ్మడి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో NLG, SRPT, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రధ్ధలతో ప్రార్ధనలు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

News April 11, 2024

భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం

image

కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక 2నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News April 11, 2024

మెదక్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి

image

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ టేక్మాల్ మండలం దన్నూరా, బర్దిపూర్, పాల్వంచ, కూసంగి, మల్కాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దుబ్బగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News April 11, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పోలింగ్ కేంద్రాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 3,303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రాల సంఖ్య 4,004లకు చేరింది. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి. సగటున ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున కేంద్రాలు పెంచారు. ఏటా చనిపోయినవారు, స్థానికంగా లేనివారి ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చాలామంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

News April 11, 2024

‘నా జీవితం తెరిచిన పుస్తకం’: మాజీ మంత్రి కొప్పుల

image

నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించారు. నా ఆస్తులు లెక్కపెట్టడానికి గెలిచినవా? లేక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గెలిచినవా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

News April 11, 2024

మంత్రి సీతక్క కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

image

మంత్రి సీతక్క కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్లంపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గూడ మండలంలో నేడు మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని ములుగుకు వస్తుండగా ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, వారికి మంత్రి సహకరించారు.

News April 11, 2024

NLG: కళాశాలలో ప్రవేశాలకు రేపే ఆఖరి రోజు

image

ఉమ్మడి జిల్లాలోని మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ గురుకుల జూనియర్ బాలికల, బాలుర కళాశాలలు, డిగ్రీ మహిళా, పురుషుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాలయాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రవేశపరీక్ష ద్వారా సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు http///www.mjptbcwreis. telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.

News April 11, 2024

ADB: యువకుల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో యువకులు కొందరు డబ్బుల లావాదేవీల విషయమై గురువారం ఘర్షణ పడ్డారు. అనంతరం కోలిపుర కాలనీకి చెందిన ముజాహిద్, షాహిద్‌లపై కత్తులతో దాడిచేశారు. గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న DSP ఎల్.జీవన్ రెడ్డి, సీఐ సత్యనారాయణ అశోక్ రిమ్స్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.