Telangana

News April 11, 2024

సిద్దిపేట: బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తాం: మైనంపల్లి

image

బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేటలో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణతో కలిసి సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్, కౌన్సిలర్ రియాజుద్దిన్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి భారీ మెజారిటీ వచ్చేలా నాయకులు పనిచేయాలన్నారు.

News April 11, 2024

ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లందు మండలం మామిడగుండాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా రేషన్‌ డీలర్‌గా పని చేస్తున్న ఎర్రిపోతుల బిక్షపతి స్నేహితులతో ఈతకి వెళ్లి మునిగిపోయాడు. బావిలో నీటిని మోటార్ల సహాయంతో తోడి ఆతనిని బయటకు తీసుకువచ్చారు. కొంత సేపటికి అతను మృతి చెందాడు.

News April 11, 2024

హైదరాబాద్‌ మెట్రోలో ఇదీ పరిస్థితి!

image

కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, బేగంపేట, అమీర్‌పేట మెట్రో స్టేషన్ల వద్ద ఉదయం, సాయంత్రం రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లకు మొత్తం 171 కోచ్‌లున్నాయి. అదనంగా 40 నుంచి 50 తీసుకొస్తామని మెట్రో గతంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని పలువురు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీకామెంట్?

News April 11, 2024

హైదరాబాద్‌ మెట్రోలో ఇదీ పరిస్థితి!

image

కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, బేగంపేట, అమీర్‌పేట మెట్రో స్టేషన్ల వద్ద ఉదయం, సాయంత్రం రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లకు మొత్తం 171 కోచ్‌లున్నాయి. అదనంగా 40 నుంచి 50 తీసుకొస్తామని మెట్రో గతంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని పలువురు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీకామెంట్?

News April 11, 2024

జన్నారం: కడుపునొప్పి భరించలేక మహిళా ఉద్యోగి మృతి

image

కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి మహిళా మృతిచెందిన ఘటన జన్నారం మండలం మురిమడుగులో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల వివరాలిలా.. గద్దల నవ్య (28 ) ఉట్నూర్ RDO కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి తీవ్రమవ్వడంతో బాధ భరించలేక పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది.

News April 11, 2024

మెదక్‌ MP స్థానంపై మైనంపల్లి ఫోకస్!

image

మెదక్‌ MP స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మైనంపల్లి హన్మంతరావు, MLA రోహిత్‌ కీలక నేతలను హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బుధవారం BRS కౌన్సిలర్లు రోహిత్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రామాయంపేటలోని నలుగురు కౌన్సిలర్లు‌ కాంగ్రెస్‌లో చేరగా.. తూప్రాన్‌ మున్సిపాలిటీలోనూ హస్తం పాగా వేసింది. లోక్‌సభ అంతటా పార్టీ బలోపేతం కోసం మైనంపల్లి‌ ప్రత్యేక చొవర తీసుకొంటున్నట్లు టాక్.

News April 11, 2024

వరంగల్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు

image

వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ ఆధ్వర్యంలో నేడు ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములుతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News April 11, 2024

నవీపేట: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

నవీపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోస్లి గ్రామశివారులో గల లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్‌లో గురువారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే నవీపేట్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై యాదగిరి గౌడ్ కోరారు.

News April 11, 2024

NLG: మిగిలింది నాలుగు రోజులే

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. నలగొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.

News April 11, 2024

KMM : మిగిలింది నాలుగు రోజులే

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.