Telangana

News April 11, 2024

HYD: ఘనంగా రంజాన్ వేడుకలు.. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా
రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్ద పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్ లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీదులో, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద భక్తులతో కిటకిటలాడింది.

News April 11, 2024

HYD: త్వరలో సాగర్ ఎమర్జెన్సీ పంపింగ్!

image

HYD నగరంలో మంచినీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నెలకు 2.5 లక్షల ట్రిప్పుల నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని, త్వరలో నాగార్జునసాగర్ ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించి నగర ప్రజలకు నీరు అందించనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

News April 11, 2024

HYD: త్వరలో సాగర్ ఎమర్జెన్సీ పంపింగ్!

image

HYD నగరంలో మంచినీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నెలకు 2.5 లక్షల ట్రిప్పుల నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని, త్వరలో నాగార్జునసాగర్ ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించి నగర ప్రజలకు నీరు అందించనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

News April 11, 2024

కరీంనగర్: ఇంకా ఐదు రోజులే!

image

పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఓటు హక్కు నమోదు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో 18 సంవత్సరాలు నిండినవారిపై బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 15 లోపు నూతన ఓటు నమోదు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. 25న తుది జాబితా విడుదల చేయనున్నారు.

News April 11, 2024

BREAKING: సూర్యాపేట: ఘోర రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేట మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయినిగూడెం గ్రామం వద్ద స్కూటీని తప్పించబోయిన ఎర్టీగా వాహనం చెట్టును ఢీ కొట్టడంతో స్పాట్‌లో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

పాపన్నపేట: అప్పుల బాధతో ఆత్మహత్య

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబిది యేసు(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురైన యేసు రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట పోలీసులు కుర్తివాడకు చేరుకొని విచారణ చేస్తున్నారు.

News April 11, 2024

NLG: డేంజర్ బెల్స్.. అడుగంటుతున్న సాగరం!

image

తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జునసాగర్ అడుగంటుతోంది. డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్‌ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. ఇప్పటికే ఈ ఆయకట్టు పరిధిలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తాగునీటి కష్టాలు కూడా పొంచి ఉన్నాయి.

News April 11, 2024

MBNR: రాజకీయ పార్టీల కొత్త వ్యూహాలు

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల నాయకులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై స్థానిక నాయకత్వం గట్టిగా పనిచేయించే బాధ్యతను పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేసిన వారికే ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలిస్తున్నారు.

News April 11, 2024

MBNR: పెరుగుతున్న CNG వాహనాల వినియోగం

image

ఉమ్మడి జిల్లాలో CNG వాహనాల వినియోగం పెరుగుతుంది. ధర తక్కువగా ఉండడం మంచి మైలేజీ రావడంతో CNG వాహనాలు వినియోగించేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. కిలో CNG ధర రూ.90 కాగా ఆటోలకు 40 కి.మీ, కార్లకు 32 కి.మీ మైలేజీ వస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా CNG కార్లు, ఆటోలు 2,037 ఉన్నాయి. CNG వాహనాలు అత్యధికంగా 920 మహబూబ్ నగర్ జిల్లాలో, అత్యల్పంగా 192 నారాయణపేట జిల్లాలో ఉన్నాయి.

News April 11, 2024

శ్రీశైలం: తాగునీటి వినియోగానికి నెలకు 0.8 టీఎంసీలు !

image

శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ 29.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34 టీఎంసీల నీరు ఉంది.. మరో 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నెలకు 0.8 టీఎంసీల అవసరం ఉంటుందని తెలిపారు. జలాశయం 800 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని అన్నారు.