Telangana

News April 11, 2024

గంగారం అడవుల్లో ఆసియన్ ఫాం సీవెట్ క్యాట్

image

బిజినేపల్లి మండలం గంగారం ఫారెస్టులో అరుదుగా కనిపించే ఆసియన్ ఫాం సీవెట్ క్యాట్ గాయపడి సృహ కోల్పోయిన స్థితిలో భీముడి తండా వాసులకు కనిపించింది. సమాచారం అందుకున్న గంగారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంటి, బీట్ ఆఫీసర్ మోహన్లు సీవేట్ క్యాట్ ను స్వాధీనం చేసుకొని పశు వైద్యాధికారితో చికిత్స అందించారు. అడవిలో నుంచి నీటి కోసం వచ్చిన దాన్ని గుర్తుతెలియని జంతువులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు తెలిపారు.

News April 11, 2024

కరకగూడెం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు

image

కరకగూడెం మండలం బంగారు గూడెం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులు తోగ్గూడెం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

సికింద్రాబాద్: ప్రత్యేక రైళ్లు.. జాగ్రత్తలు పాటించండి!

image

వేసవి కాలంలో రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు షెడ్యూల్ వారీగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. స్పెషల్ ట్రైన్లలో వెళ్లేవారు, రైలు సమయానికి కనీసం అర్ధగంటకు ముందుగానే స్టేషన్ వద్దకు చేరుకోవాలని సూచించారు. రైలు డోర్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దని హెచ్చరించారు.

News April 11, 2024

KNR: 16 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ (హానర్స్) డిజైన్, టెక్నాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయని విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వి శ్రీరంగ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు గమనించాలని ఆయన తెలిపారు.

News April 11, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మృతి

image

వనపర్తి జిల్లాలో రాజపేట సమీపంలో జరిగిన <<13027779>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు<<>> ఉద్యోగులు చనిపోయారు. జడ్చర్ల మండలం అలూరుకు రవికమార్, MBNR జిల్లా ధర్మాపూర్‌కు చెందిన వెంకటయ్య మిత్రులు. గద్వాల పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా చేస్తున్న రవి.. వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటయ్యతో కలిసి బైక్ పై MBNR వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజపేట శివారులో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

News April 11, 2024

నన్ను చంపేందుకు కుట్ర: పుట్ట మధు

image

తనను చంపేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్‌మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా ఎదిగిన తనపై కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 11, 2024

సదాశివపేట: క్రీడా ప్రాంగణంలో గుడిసెలు !

image

సదాశివపేట మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్వహణ అధ్వానంగా మారింది. బోర్డులు పాతిన మున్సిపల్ అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడంతో కొందరు కబ్జా చేస్తున్నారు. పట్టణంలోని ఓ క్రీడా ప్రాంగణంలో కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలు కబ్జాకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు.

News April 11, 2024

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఏడాది బాలుడు మృతి

image

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఓ పసిబిడ్డ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సోమిడి – శుక్లాన్ దంపతుల ఏడాది కుమారుడికి జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మృతి చెందాడు. బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడని ఆర్ఎంవో రాజశేఖర్ తెలిపారు.

News April 11, 2024

HNK: బొక్కలగడ్డ ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు

image

హనుమకొండ బొక్కలగడ్డలోని ఈద్గాలో గురువారం ఉదయం రంజాన్ పండుగ సందర్బంగా ప్రార్థనలు చేశారు. హన్మకొండ నగరంలోని ముస్లింలు ఉదయమే కొత్త బట్టలు ధరించి ఇంతో నిష్టతో నమాజ్ చేశారు. ముస్లిం సోదరులతో ఈద్గా నిండిపోయింది. ఈద్గా దగ్గర హన్మకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 11, 2024

MBNR: నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

image

ఉమ్మడి జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. తాగునీటికి ఇబ్బందులు ఉన్న పట్టణాలు, గ్రామాలు, ఆవాసాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే మరమ్మతులకు గురైన బోరు బావులు, చేతిపంపులు యుద్ధప్రతిపాదికన బాగు చేయించాలని సూచిస్తున్నారు.