Telangana

News April 11, 2024

MBNR: మూడు నెలల పాటు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి!

image

SC సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు ఫౌండేషన్ కోర్సుపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ జిల్లా అధికారి పాండు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 12వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 11, 2024

HYD, ఉమ్మడి RRలో రంజాన్ సందడి

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని HYD, ఉమ్మడి RR జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. రాత్రంతా షాపులను తెరిచి ఉంచారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.

News April 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏ఏర్పాట్లు పూర్తి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు
✏MBNR:నేడు ఏర్పాట్లు.. రేపు అథ్లెటిక్స్ ఎంపికలు
✏కొనసాగుతున్న ఇంకుడు గుంతల సర్వే
✏పలుచోట్ల తాగునీటి సమస్యలపై హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు
✏ఈద్గాల వద్ద భారీ బందోబస్తు
✏బాలానగర్:నేటి నుంచి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభం
✏రంజాన్ వేడుకల్లో పాల్గొననున్న స్థానిక MLAలు,నేతలు
✏తిమ్మాజీపేట:నేటి నుంచి వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు

News April 11, 2024

జగిత్యాల: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం మణిదీప్ (31) ప్రేమ విఫలమై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మణిదీప్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికి మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 11, 2024

మంచిర్యాల: భారీగా పెరిగిన ధరలు

image

ఉమ్మడి ADB జిల్లాలో కోడి మాంసం ధర కొండెక్కింది. వారం క్రితం కిలో రూ. 200 ఉండగా అమాంతం రూ.300 చేరుకోవటంతో మాంసాహారుల నోరు చప్పబడింది. ఉమ్మడి జిల్లాలో నిత్యం 65 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు జరుగుతాయి. ఆదివారం 100 టన్నుల వరకు విక్రయాలు జరుగుతాయి. వేసవి తాపం ప్రారంభం..కూరగాయలతో పాటు మాంసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 10 రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో వేడి ఉష్ణోగ్రతకు కోళ్లు మృత్యువాతపడుతున్నాయి.

News April 11, 2024

పాలకుర్తి: తమ్ముడిని కాపాడిన అక్క

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మధుప్రియ(10) తన తమ్ముడు మణివర్ధన్(6)ను కాపాడినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల వివరాలు.. ఇంట్లో వాటర్ హీటర్ ఆన్‌లో ఉండగా అది తెలియని మణివర్ధన్ దానిని పట్టుకోగా షాక్ తగిలింది. అలాగే హీటర్ వదలక ఏడుస్తుండగా స్నానం చేస్తున్న అక్క మధుప్రియ విని వెంటనే వెళ్లి సమయస్ఫూర్తితో హీటర్ ప్లగ్ తీసి కాపాడింది.

News April 11, 2024

ఈ రెండో శనివారం సెలవు లేదు: DEO గోవిందరాజులు

image

ఈనెల 13న రెండో శనివారం పాఠశాలలకు సెలవు లేదని NGKL, WNPT జిల్లాల డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు ఉంటుండగా ఈ నెలలో రెండో శనివారం పాఠశాలలకు పని దినమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు పనిచేసేలా సంబంధిత ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 11, 2024

నిజామాబాద్ నగర మేయర్ భర్త బైండోవర్

image

నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త చంద్రశేఖర్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని NZB శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల నాయబ్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. NZB నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న దండు చంద్రశేఖర్‌ను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు.

News April 11, 2024

తిరుమలాయపాలెం: భార్యను హతమార్చిన భర్త

image

భార్యకు ఉరివేసి హత్య చేసిన సంఘటన తిరుమలయపాలెం మండలంలో బుధవారం జరిగింది. సుబ్లేడ్‌కు చెందిన పోలెపొంగు ఇస్తారి, ఆయన భార్య సరోజన (63) కుమారుడు సుమంత్‌తో కలిసి జీవిస్తున్నారు. సుమంత్ మంగళవారం ఉగాది పండుగకు భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఇస్తారి భార్యతో గొడవ పడి మెడకు ఉరివేశాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 11, 2024

NLG: తనిఖీలలో రూ. 2.48 కోట్లు స్వాధీనం

image

లోక్ సభ ఎన్నికల నియమావళితో అధికార యంత్రాంగం జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు జిల్లా సరిహద్దు చెక్ పోస్టులతో పాటు ఎస్ఎస్‌టీ కేంద్రాల ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.2,48,58,597 నగదుతో పాటు 13.406 గ్రాముల బంగారం ఆభరణాలు, 3,453 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాస్తవ దృవపత్రాలు చూపిన వారికి 24 గంటల్లో తిరిగి నగదు, బంగారు వస్తువులను అందజేస్తున్నారు.