Telangana

News April 10, 2024

సంగారెడ్డి: సెల్ టవర్ ఎక్కి హల్‌చల్

image

సంగారెడ్డి జిల్లా కంది తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి బుధవారం హల్చల్ చేశారు. కాశీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య తన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెల్ టవర్ ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని కోరారు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగాడు.

News April 10, 2024

MBNR: 68,875 మందికి చెక్కర పంచాల్సిందే.. !

image

MBNR: చౌకధర దుకాణాల్లో ఇక నుంచి చక్కెర తప్పనిసరిగా పంపిణీ చేయాలని డీలర్లను పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఉచిత బియ్యంతోపాటు పంచదార ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 చౌక దుకాణాలు ఉన్నాయి. AAY లబ్ధిదారులు 68,875 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల కిలో చొప్పున చక్కెర పంపిణీ చేయాలంటే ఉమ్మడి జిల్లాకు గోదాము నుంచి 96.88 టన్నుల దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

News April 10, 2024

పొన్నం అశోక్‌కు టీపీసీసీ లీగల్ పదవి

image

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది, పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఛైర్మన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ వర్గాలు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశాయి. అశోక్ గౌడ్ నియామకం పట్ల స్థానిక న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు, బార్ అసోసియేషన్ వర్గాలు అభినందనలు తెలిపాయి.

News April 10, 2024

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

image

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరబాద్‌లోనిఎమ్మేల్యే రాజ్‌గోపాల్ రెడ్డి నివాసంలో చర్చించారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

News April 10, 2024

నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

మహిళలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో మహిళను వేధిస్తున్న పోకిరీలపై 5 కేసులు, 4 పెట్టి కేసులు నమోదు చేశామని చెప్పారు. లేడీస్ ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే వెంటనే 87126564425, 100కి ఫిర్యాదు చేయాలని అన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

News April 10, 2024

పాలీసెట్-2024 పరీక్ష విధానం ఇలా..!

image

వనపర్తి: మే 24న పాలీసెట్-2024 రాత పరీక్ష ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుందని, గణితం 60 నిమిషాలు, భౌతిక శాస్త్రం 30 నిమిషాలు, రసాయన శాస్త్రం 30 నిమిషాల వ్యవధిలో జవాబులు రాయవలసి ఉంటుందని అన్నారు. 9,10 వ తరగతి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయని ఆయన తెలిపారు.

News April 10, 2024

NLG: నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ఉదయం సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 510.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 132.8618 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక గత సంవత్సరం ఇదే సమయంలో 528.00 అడుగులు, 164.2680 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ లో 6,846 క్యూసెక్కులు ఉంది.

News April 10, 2024

ఉమ్మడి జిల్లాలో కలగానే కల్లాల నిర్మాణాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యం ఆరబోతకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ యాసంగిలో‌ 4,78,649 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 8.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలు కలగానే మిగిలాయి. ధాన్యం ఆరబోతకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి కల్లాల నిర్మాణాలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

News April 10, 2024

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది

image

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన కాచిగూడలో జరిగింది. పోలీసుల ప్రకారం.. NZBకి చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈనెల 8న కాచిగూడ, సుందరనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అతడి కుమార్తె గౌరీ(13) సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.

News April 10, 2024

ASF: 108లో ప్రసవం

image

108లో అంబులెన్స్‌లో ఓ గర్భిణీ ప్రసూతి అయిన ఘటన సిర్పూర్ (U) మండలంలో జరిగింది. 108 EMT ఆత్రం రామేశ్వరి, పైలెట్ దయాకర్ తెలిపిన వివరాలు.. మత్తురతాండకు చెందిన జ్యోతికి పురుటి నొప్పులు రావడంతో కుటంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ రామేశ్వరి సహాయంతో జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలింతను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని EMT తెలిపారు.