Telangana

News April 10, 2024

HYD: కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు: నరసింహులు

image

MP ఎన్నికల్లో భాగంగా ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించకాపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూల్ MP టికెట్ అధికంగా ఉన్న మాదిగలకు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున డిమాండ్ చేశారు.

KNR: మత్తులో చిత్తవుతున్న యువత

image

ఉమ్మడి KNR జిల్లాలో గంజాయి అక్రమ రవాణా భారీగా పెరుగుతోంది. దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గత రెండేళ్ల నుంచి కరీంనగర్‌లో 22, పెద్దపల్లి 25, జగిత్యాల11, సిరిసిల్ల 59కి పైగా పోలీస్ అధికారులు కేసులు నమోదు చేశారు. కాగా, జిల్లాలో యువత ఎక్కువగా మత్తుకు అలవాటు పడింది.

News April 10, 2024

వరంగల్ మార్కెట్‌కు నాలుగు రోజుల వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మళ్లీ వరుస సెలవులు రానున్నాయి. రేపు, ఎల్లుండి (గురువారం, శుక్రవారం) రంజాన్ సందర్భంగా సెలవులు, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News April 10, 2024

HYD: ఈనెల 18 నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు

image

ఈనెల 18 నుంచి 25 వరకు చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చుకుడు రంగరాజన్ తెలిపారు. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం ఉంటుందని, 25న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నూతన క్రోధి నామ సంవత్సరం నేపథ్యంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.  SHARE IT

News April 10, 2024

HYD: ఈనెల 18 నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు

image

ఈనెల 18 నుంచి 25 వరకు చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చుకుడు రంగరాజన్ తెలిపారు. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం ఉంటుందని, 25న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నూతన క్రోధి నామ సంవత్సరం నేపథ్యంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.

News April 10, 2024

ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

image

నిజామాబాద్ ఎంపీ అరవింద్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ 2019లో తెస్తే కాంగ్రెస్ లొల్లి పెట్టిందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలకు సైతం పౌరసత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడని, ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడన్నారు. మరి ముస్లింలకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేక ముస్లిం దేశాలు ఎందుకని ప్రశ్నించారు.

News April 10, 2024

HYD: తల్లి వదిలేసింది.. తండ్రి చనిపోయాడు.. బాలిక ఆత్మహత్య 

image

హాస్టల్‌లో ఉండే ఓ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన HYDదుండిగల్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూరారం ప్రాంతానికి చెందిన బాలిక(13) దుండిగల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. మూడేళ్ల వయసులో ఆమెను తల్లి వదిలేసి వెళ్లింది. ఇటీవల తండ్రి మరణించడంతో ఒంటరైంది. బాలికను ఆమె మేనత్త ఓ ఫౌండేషన్‌లో చేర్పించింది. ఈక్రమంలో బాలిక హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోగా మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.