Telangana

News April 10, 2024

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

News April 10, 2024

సిరిసిల్ల: అత్తింటి వేధింపులు భరించలేక గృహిణి సూసైడ్

image

అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జీనోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్ యాదయ్య గౌడ్ ప్రకారం.. మల్యాలకు చెందిన మాధురి(22)కి.. వేణుతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. శామీర్పేట మండలంలో నివాసం ఉంటూ భర్త వేణు ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం సా. భర్త వచ్చేసరికి మాధురి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. అయితే అత్తింటి వేధింపులతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

News April 10, 2024

వరంగల్: పత్తి ధర క్వింటాకి రూ.7260

image

ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కి పత్తి తరలిరాగా.. కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే పత్తి ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7260 పలికింది.

News April 10, 2024

పటాన్‌చెరు: పెళ్లి బట్టలకు వచ్చి యువతి MISSING

image

ఓ యువతి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్‌కు చెందిన యువతకి పెళ్లి కుదరడంతో బట్టలు, ఇతర సామగ్రి కొనేందుకు ముత్తంగిలో బంధువుల ఇంటికి వచ్చింది. షాపింగ్ అనంతరం ఆ యువతిని బంధువులు ఖేడ్ బస్సు ఎక్కించగా ఆమె ఇంటికి వెళ్లలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 10, 2024

నల్గొండ: రెండు తలల గొర్రె పిల్ల జననం 

image

తిప్పర్తి మండలంలోనీ అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన కన్నెబోయిన చెన్నయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె మంగళవారం సాయంత్రం రెండు తలలతో గొర్రె పిల్లకి జన్మనిచ్చింది. వింత ఆకారంలో జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చాారు. జన్యుపరమైన లోపంతో ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. 

News April 10, 2024

HYD: సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలి: డిప్యూటీ సీఎం

image

హైటక్ సిటీ ట్రీడెంట్ హోటల్లో జరిగిన గీతాంజలి మళ్లి వచ్చింది సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కోన వెంకట్ ఆధ్వర్యంలో వెలువడిన గీతాంజలి మళ్లీ వచ్చిందనే సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నాడు సినిమాలు సామాజిక బాధ్యత, సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే విధంగా పాత్రలు ఉండేవని, సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలని పేర్కొన్నారు.

News April 10, 2024

HYD: సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలి: డిప్యూటీ సీఎం

image

హైటక్ సిటీ ట్రీడెంట్ హోటల్లో జరిగిన గీతాంజలి మళ్లి వచ్చింది సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కోన వెంకట్ ఆధ్వర్యంలో వెలువడిన గీతాంజలి మళ్లీ వచ్చిందనే సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నాడు సినిమాలు సామాజిక బాధ్యత, సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే విధంగా పాత్రలు ఉండేవని, సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలని పేర్కొన్నారు.

News April 10, 2024

ఖమ్మం: వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.  కారేపల్లి మండలం తొడితలగూడెంకి చెందిన వెంకటేశ్వర్లు (55) వ్యవసాయ కూలీ పనికి వెళుతుంటారు. సోమవారం వడదెబ్బ కొట్టగా మంగళవారం చనిపోయారు. బోడు పంచాయతీ లాక్యాతండాకు చెందిన బాలాజీ, కొత్తగూడేనికి చెందిన 14,15 డివిజన్ల సీపీఐ కార్యవర్గ సభ్యుడు బక్కయ్య ఎండదెబ్బతో మృతిచెందారు. 

News April 10, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదం UPDATE..

image

బిజినేపల్లిలో డివైడర్‌ను తుఫాన్ ఢీకొట్టిన ఘటనలో మృతులు వసుంధర, భారతిగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉగాది సందర్భంగా కర్ణాటకకు చెందిన 13 మంది భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డివైడర్ అసంపూర్తి, సూచికబోర్డులు లేక ఎన్నో ప్రమాదం జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

News April 10, 2024

రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం ఎన్నికపై సమీక్ష చేయనున్నారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ ఛార్జీగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.