Telangana

News September 9, 2024

HYD: నగరంలో వర్షాలతో తగ్గిన వాయు కాలుష్యం

image

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వాతావరణం పూర్తిగా మారింది. దీంతో కాలుష్య స్థాయులు తగ్గాయని పీసీబీ అధికారులు వెల్లడించారు. 10 కేంద్రాల్లో వాయునాణ్యత సూచీని లెక్కించగా 53గా నమోదైందని తెలిపారు. హెచ్సీయూ కేంద్రం వద్ద అత్యల్పంగా 23, న్యూమలక్‌పేట్ వద్ద అత్యధికంగా 73గా నాణ్యత సూచీ నమోదైందని వెల్లడించారు. జూ పార్కు 28, కొంపల్లి 55, ఈసీఐఎల్ 56, సనత్ నగర్ 59, నాచారం 62గా నమోదైంది.

News September 9, 2024

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు 25వ ర్యాంకు

image

కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2024లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే గాలిలో ధూళికణాల మెరుగుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాల్లో హైదరాబాద్‌ 163.3 మార్కులతో 25వ స్థానంలో నిలిచింది.

HYD: నరాల సమస్యకు నిమ్స్ ఆధునిక వైద్యం

image

నరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఆధునిక వైద్యం అందించేందుకు టీఎంఎస్ యంత్రం అందుబాటులోకి వచ్చిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప చెప్పారు. ఆదివారం ఆసుపత్రి కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈయంత్రం సాయంతో మెదడులో ఏవైనా సమస్యలు తలెత్తితే బైపాస్ పద్ధతిలో చికిత్స చేసి తిరిగి పూర్వస్థితికి తీసుకురావచ్చన్నారు. రూ.2 కోట్ల విలువైన టీఎంఎస్ యంత్రంతో తక్కువ సమయంలో ఆధునిక వైద్యం అందించవచ్చని తెలిపారు.

MBNR: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట జాతీయ స్థాయిలో క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 91 కళాశాలలు ఉన్నాయి. 40 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.

News September 9, 2024

HYD: మాదాపూర్‌లో దేశంలోనే అతిపెద్ద సదస్సు

image

దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సు హైదరాబాద్ వేదికగా కానుంది. సీఐఐ ఆధ్వర్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు మాదాపూర్‌లోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 23వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్, సీఐఐ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిల్వర్ జూబ్లీ, పవర్ ప్లాంట్ సమ్మిట్ 2024, పేపర్ టెక్ 2024, గ్రీన్ షుగర్ సమ్మిట్ 2024 వంటి 3 ప్రధాన రంగాలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

కరీంనగర్: 20 లోపు దరఖాస్తులకు అవకాశం

image

కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడుత ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఆసక్తి గల విద్యార్థులు www.iti.telangana.gov.in వెబ్ సైట్‌‌లో రూ.100 రుసుం చెల్లించి ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 9, 2024

బుడమేరులా.. భద్రకాళి చెరువుతో పొంచి ఉన్న ముప్పు!

image

APలో విజయవాడను బుడమేరు వాగు వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అధికారులు పట్టించుకోకుంటే మన వరంగల్ నగరంలో భద్రకాళి చెరువుతోనూ పెద్ద ముప్పే ఉంది. గతంలో భద్రకాళి చెరువుకు గండి పడటంతో సమీపంలోని కాలనీ వాసులను ఖాళీ చేయించారు. హంటర్ రోడ్డు బొందివాగు పొంగితే వరద ధాటికి పోతన నగర్ వైపు మరోసారి గండి పడే ప్రమాదం ఉంది. స్మార్ట్ సిటీ పనుల్లో కట్టకు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తేనే సమస్య తొలుగుతుంది.