Telangana

News April 10, 2024

HYD: అర్ధరాత్రి గుడి ముందు MURDER

image

ఫుట్‌పాత్‌పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్‌పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

News April 10, 2024

HYD: రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుక‌లు

image

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్ర‌జ‌లంద‌రి కొత్త ఆశయాలు నెర‌వేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 10, 2024

HYD: రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుక‌లు

image

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్ర‌జ‌లంద‌రి కొత్త ఆశయాలు నెర‌వేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 10, 2024

నల్గొండ: కొండెక్కిన చికెన్ ధరలు

image

రోజురోజుకూ కోడిమాంసం వెల కొండెక్కుతోంది. మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన చికెన్‌ ధర నేడు రూ.294కు చేరింది. దీంతో దుకాణానికి వెళ్లిన వారు ధర అడిగి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిలో తీసుకునే వారు ఇప్పుడు ధరను చూసి అరకిలో తోనే పరిమితమవుతున్నారు. మున్ముందు చికెన్ ధరలు రూ.300పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

News April 10, 2024

నేడు జగిత్యాలకు KCR

image

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల పట్టణానికి రానున్నారు. MLA డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో నేడు ఓ గార్డెన్స్‌లో జరిగే 13వ రోజు(స్వర్గ పాత్ర) కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.

News April 10, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔MBNR: నేడు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ్
✔గ్రామాల్లో తాగునీటి పరీక్షలు
✔నేటి రంజాన్ వేళలు:ఇఫ్తార్(బుధ):6:38
✔కోస్గి:నేడు కరెంట్ కట్
✔నేడు సంయుక్త ఖాతాల కొరకు దరఖాస్తు చేసుకోండి:DEOలు
✔పరుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న స్థానిక MLAలు,ప్రజాప్రతినిధులు
✔SA-2 పరీక్షలపై అధికారుల ఫోకస్
✔దామరగిద్ద:నేడు సమీక్ష..11 నుంచి వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
✔కొనసాగుతున్న తనిఖీలు

News April 10, 2024

వరంగల్: మరో 6 రోజులే గడువు

image

ఈనెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక బీల్వోకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మార్పులు కూడా చేసుకోవచ్చు.

News April 10, 2024

KMM: 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగు

image

ఏడాది ఆశించిన స్థాయిలో నీటి సౌకర్యం లేక యాసంగిలో వరి సాగు గణనీయంగా తగ్గింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,62,391 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,05,333 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 57,058 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సన్న రకాల సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.

News April 10, 2024

ఐసీయూలో ఉన్న రోగి బంగారు ఆభరణాలు చోరి

image

నిజామాబాద్ ద్వారకానగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి సంబంధించిన రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ విషయమై రోగి కుటుంబీకులు ఒకటో టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ బాబు తెలిపారు.

News April 10, 2024

MBNR: నేటితో ముగియనున్న గడువు..!

image

ఉమ్మడి జిల్లాలో TET అర్హత పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. నేటితో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. ఉపాధ్యాయుల నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. గత ఏడాది వరకు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకుంటే రుసుము రూ.400 ఉండేది.. ప్రస్తుతం ఒక్కో పేపర్ కు దరఖాస్తు రుసుము రూ.1000కి పెంచారు.