Telangana

News April 10, 2024

సంయుక్త ఖాతాల ప్రారంభానికి దరఖాస్తులు

image

NGKL: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్యర్యంలో ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తీసేందుకు HMలు దరఖాస్తు చేసుకోవాలని DEO డా.గోవిందరాజులు తెలిపారు. బ్యాంకు ఖాతాను తీసేందుకు MEOల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను బుధవారం వరకు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘం అధ్యక్షురాలు, HM పేరుతో సంయుక్త ఖాతా తీయాలన్నారు.

News April 10, 2024

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రత దృష్ట్యా, ప్రశాంతత పెంపొందించేందుకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, చేపట్టవద్దని డీజేలు, వాడరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

News April 10, 2024

సిద్దిపేటలో ఉద్యోగుల సస్పెన్షన్.. పెనుభారం !

image

మెదక్ MP అభ్యర్థి వెంకట్రామారెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులను సిద్దిపేట కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే జిల్లాలో ప్రస్తుత వేసవి సీజన్‌లో డీఆర్డీఏపై పెనుభారం పడనుంది. సెర్ప్ ఉద్యోగులు ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా ఉండగా, ఈజీఎస్ ఉద్యోగులు ప్రస్తుత వేసవిలో ఉపాధి హామీ పనుల్లో కీలకంగా పనిచేయనున్నారు. ఈ సస్పెన్షన్‌తో కొనుగోళ్లు, ఉపాధి హామీ పనుల్లో ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

News April 10, 2024

HYD: నాకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ MIMకు మద్దతిచ్చినట్టే: ఫిరోజ్‌ఖాన్

image

HYDలో ఒవైసీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేత ఫిరోజ్‌ఖాన్ అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని, కాంగ్రెస్ పరోక్షంగా MIMకు మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదేమైనా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మీ కామెంట్?

News April 10, 2024

HYD: నాకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ MIMకు మద్దతిచ్చినట్టే: ఫిరోజ్‌ఖాన్

image

HYDలో ఒవైసీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేత ఫిరోజ్‌ఖాన్ అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని, కాంగ్రెస్ పరోక్షంగా MIMకు మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదేమైనా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మీ కామెంట్?

News April 10, 2024

ఖమ్మం: ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా 

image

మూడేళ్ల పాటు ప్రేమించుకున్నాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట యువతి మంగళవారం ధర్నాకు దిగింది. నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి రాము మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. అయితే కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవడానికి రాము నిరాకరిస్తున్నాడు. దీంతో అతని ఇంటి ఎదుట  బైఠాయించి తనకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

News April 10, 2024

NGKL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి కర్ణాకటకు వెళ్తున్న తుఫాన్ వాహనం బిజినేపల్లిలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్నవారిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2024

అగ్నివీర్‌కు ఎంపిక ఇందల్వాయి బిడ్డ

image

జాతీయ స్థాయి కబడ్డీ డాకారిణి ముడేటి ప్రియాంక అగ్నివీరుకు ఎంపికైనట్లు కోచ్ ప్రశాంత్ తెలిపారు. ఇందల్వాయి మండలం అన్సాన్పల్లికి చెందిన మల్లయ్య-సావిత్రి దంపతుల చిన్న కూతురు ముడేటి ప్రియాంక.. 2023 మేలో కరీంనగర్లో జరిగిన అగ్నివీర్ ఎంపిక పరీక్షలో సత్తా చాటింది. ఫిబ్రవరిలో వెలువడిన ఫలితాల్లో శిక్షణకు ఎంపికైంది. ఏప్రిల్‌లో శిక్షణ నిమిత్తం బెంగళూరు వెళ్లనుంది.

News April 10, 2024

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

News April 10, 2024

తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా వినోద్ నాయక్

image

నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సిరికొండ మండల్ హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వినోద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని నాచారంలో నిర్వహించిన రాష్ట్ర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్ ను అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు క్రీడా ప్రతినిధులు అభినందనలు తెలిపినారు.