Telangana

News April 9, 2024

ALERT.. కరీంనగర్‌లో చికెన్‌పాక్స్

image

చికెన్‌పాక్స్, తట్టు కేసులు ఉమ్మడి KNR జిల్లాలో పెరుగుతున్నాయి. వేసవి కారణంగానే కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల KNR పట్టణం గణేశ్‌నగర్‌కు చెందిన విద్యార్థికి జ్వరం వచ్చి.. సాయంత్రంలోపే శరీరంపై బుగ్గలు కనిపించాయి. అతడికి తగ్గగానే తన తమ్ముడికి వచ్చింది. ఉమ్మడి జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. అయితే వ్యాక్సిన్లు వేసుకోనివారిలో ఈ తీవ్రత ఎక్కువ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

News April 9, 2024

MHBD: ప్రేమ వివాహం.. అబ్బాయిపై దాడి

image

ప్రేమ వివాహం చేసుకున్నాడని అమ్మాయి తరఫువాళ్లు అబ్బాయిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ మండలంలోని ఓ తండాకు చెందిన గణేశ్, ఓ యువతి ప్రేమించుకొని ఇటీవల HYDలో పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తండ్రి డోర్నకల్ ఠానాలో కేసు పెట్టగా.. ఆమెను వారి తల్లిదండ్రులతో పంపించారు. అదేరోజు గణేశ్ ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా అమ్మాయి తరఫువాళ్లు గణేశ్, అతడి తల్లిపై దాడి చేశారు.

News April 9, 2024

MBNR: ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలో పాల్గొన్న పార్టీ నేతలు

image

ఉగాది పండగ సందర్భంగా నేడు శిల్పారామంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పండితులు పార్టీ నేతల జాతకాన్ని వివరించారు. అనంతరం నాయకులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 9, 2024

బీజేపీలో చేరిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

image

ఉమ్మడి జిల్లాలో మరో నేత బీజేపీలో చేరారు. నేడు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డా.లక్ష్మణ్ సమక్షంలో ఆయన చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, ఎల్లారెడ్డి మాజీ MLA నేరేళ్ల ఆంజనేయలు బీజేపీలో చేరారు.

News April 9, 2024

ఖమ్మం 70.57 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 65.73 లక్షలు

image

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్భుతమైన ఫలితాలు ఇస్తూ వచ్చిన కార్యక్రమం ఒకటి హరితహారం. తాజాగా పదోవిడత హరితహారం అమలుకు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో 70.57 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 65.73 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం ప్రతి గ్రామపంచాయతీ నర్సరీలో 10వేలు మొక్కలు పెంచాలని సూచించింది. జూన్, జూలై నెలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.

News April 9, 2024

ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి: ఎస్పీ సురేశ్

image

లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ ఆదేశించారు. బెజ్జూరు పోలీస్ స్టేషన్‌ను నేడు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి పార్టీలు, వ్యక్తులకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్ట్ విధుల్లో ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 9, 2024

కొండగట్టులో ఘనంగా ఉగాది వేడుకలు

image

జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానాచార్యులు కాపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News April 9, 2024

MDK: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి: జగ్గారెడ్డి

image

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని పంచాంగంలో పండితుడు తెలిపినట్లు ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాని జగ్గారెడ్డి అన్నారు.

News April 9, 2024

MBNR: ఓటు నమోదుకు మరో అవకాశం

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండగా ఎన్నికల కమిషన్ ఓటు నమోదుకు మరో అవకాశం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు కారణాలతో ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం మరో అవకాశం ఈ నెల 15 వరకు ఓటరుగా నేరుగా ఆన్‌లైన్ లేదా బూత్ స్థాయి అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవడానికి గడువు పెంచింది. ఈనెల 15 వరకు వచ్చిన దరఖాస్తులు అన్నింటిని నమోదుకు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

News April 9, 2024

జనగామ: పండగ వేల విషాదం.. యువకుడు మృతి

image

జనగామ మండలం పెంబర్తి గ్రామంలో పండగ వేల విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్(26) అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు సైతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ఇతనికి 6 నెలల క్రితమే వివాహం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.