Telangana

News September 9, 2024

HYD: BRSకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాజీనామా

image

BRS హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నగర ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం కేసీఆర్, కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అయితే తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయారు.

MDK: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.

News September 9, 2024

HYD: యువత నైపుణ్యాభివృద్ధికి బల్దియా తోడు: ఆమ్రపాలి

image

చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ నిచ్చి జీవనోపాధి కల్పించే దిశగా GHMC అడుగులు వేస్తోంది. గతేడాది బల్దియా సహకారంతో చందానగర్‌లో ఏర్పాటైన లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా పలువురికి భిన్న రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఇదే మాదిరి గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి భావిస్తున్నారు. 2 నెలల్లో 4 చోట్ల ఈ కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి.

ఆదిలాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు అరెస్ట్

image

ఆదిలాబాద్ 2- పట్టణ పోలీసులు పేకట స్థావరలపై దాడుల చేసినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఓ మద్యం షాప్‌ యజమాని ఇంట్లో తనిఖీలు చేయగా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.2.28 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామన్నారు. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. మరో చోట దాడులు చేయగా ఐదురిని అరెస్ట్ చేసి, రూ.5.090 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News September 9, 2024

సిరికొండ: వినాయక మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో తాళ్లతండాలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. తండాలోని వినాయక మండపం వద్ద సంజీవ్(16) మైక్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

News September 9, 2024

సింగరేణిలో అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

image

సింగరేణి సంస్థలో ఏడాది కాలానికి అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ ఉత్తీర్ణులై నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని అధికారులు వెల్లడించారు. ఈనెల 9- 23వ తేదీ వరకు www.appre nticeshipindia.orgలో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లతో ఈనెల 10 నుంచి ఆయా ఏరియాల ఎంవీటీసీ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచించారు.

News September 9, 2024

మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎక్కువ బాధితులు!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 210 పోక్సో కేసులు,84 అత్యాచారాలు, 844 మంది అదృశ్యమైన కేసులు నమోదయ్యాయి. బాధితులు ఎక్కువ సంఖ్యలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లాలో 356 అదృశ్యం కేసులు, 36 అత్యాచారాలు, 42 పోక్సో కేసులు నమోదు కావడం ఆందోళనను కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా MBNRలోనే మహిళా PS ఉంది. ప్రతి జిల్లాకు ప్రత్యేక మహిళా PSలు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

News September 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} వరదలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం విద్యాసంస్థలు పున: ప్రారంభం
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} అశ్వాపురంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన