Telangana

News April 9, 2024

ఉగాది తర్వాతే BRS వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తాం: ఎర్రబెల్లి

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ తర్వాతే BRS వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్‌ గెలిస్తేనే తెలంగాణ గొంతుక పార్లమెంట్‌లో వినిపిస్తుందన్నారు.

News April 9, 2024

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 గడువు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

News April 9, 2024

HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర 

image

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్‌ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?

News April 9, 2024

HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర

image

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్‌ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?

News April 9, 2024

మిర్యాలగూడలో వడదెబ్బతో ఇద్దరి మృతి 

image

మిర్యాలగూడలో వడదెబ్బ కారణంగా సోమవారం ఒక్కరోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ప్రకాష్ నగర్ తొమ్మిదో వార్డుకు చెందిన శ్యామల పెంటయ్య(70), బండి అడవయ్య (65) ఎండ తీవ్రతకు అవస్థతకు గురై చనిపోయారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయని చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 

News April 9, 2024

ఆకుపై చిత్రాలతో ఉగాది శుభాకాంక్షలు

image

నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకు మార్ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు. ఈరోజు ఉగాది పచ్చడికి వినియోగించే మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, చెరకు గడలు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చని చెట్లు, కోయిలలు, చిలకలు, ఉగాది పచ్చడితో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ చిత్రాలను గీసి క్రోధి నామ సంవత్సరానికి ఆయన స్వాగతం పలికారు.

News April 9, 2024

MNCL: ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపే మండలానికి చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్‌ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.

News April 9, 2024

ధర్మారం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

image

ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపేటకు చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్‌ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.

News April 9, 2024

నేటి నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. నేటి నుంచి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే అంచనాతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని దేవస్థానం అధికారులు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

News April 9, 2024

HYD: సైబర్ ముఠా ఆట కట్టిస్తాం: సీపీ

image

అమాయక ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్న సైబర్ ముఠాల ఆటలు కట్టిస్తామని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై PSల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.