Telangana

News April 9, 2024

ధర్మారం: వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

ధర్మారం మండలంలో ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా తాత వరుసైన వృద్ధుడు తన నివాసంలోకి తీసుకెళ్లాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అతడిని మందలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

News April 9, 2024

వెంకటాపురం: చేపల మార్కెట్‌లో వ్యక్తిపై కత్తితో దాడి

image

చేపల మార్కెట్లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. మార్కెట్లో చేపల విక్రయిస్తున్న నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తిపై వంశీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వంశీని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News April 9, 2024

NZB: దొంగ అనుకొని చెట్టుకు కట్టేశారు..!

image

మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించి పోలీసులకు అప్పగించిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో చోటు చేసుకుంది. నిజామాబాద్ గాజుల్ పేటకు చెందిన గుండమల్ల గంగాధర్ ఎలుకుర్తి హవేలిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు వచ్చి అతన్నిపోలీస్ స్టేషన్ తరలించారు. గంగాధర్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

News April 9, 2024

HYD: ‘ఉగాది’.. కల్పిస్తోంది ఉపాధి..!

image

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

News April 9, 2024

HYD: ‘ఉగాది’.. కల్పిస్తోంది ఉపాధి..!

image

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

News April 9, 2024

MBNR: తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడి క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గోకారంకు చెందిన బాదగోని అల్లాజి (52) మద్యానికి బానిస కావడంతో భార్య మల్లమ్మ వారించి చెప్పగా వారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 9, 2024

సూర్యాపేట రోడ్డుప్రమాదం.. ఐదుకు చేరిన మృతులు

image

సూర్యాపేట మానసనగర్ వద్ద జరిగిన <<12992243>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఐదుకు చేరింది. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మోక్షిత్ (7) ఇవాళ మృతిచెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

News April 9, 2024

MDK: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్‌పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

MHBD: ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం మినహాయింపు

image

మహబూబాబాద్ పట్టణ ప్రజలు ఈ నెల 30వ తేదీలోగా ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం మినహాయింపు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణ ప్రజలు 2024-25 సంవత్సరం ఇంటి పన్ను నంబర్, పాత డిమాండ్ నోటీస్‌తో గాని చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో చెల్లించవచ్చన్నారు.

News April 9, 2024

మంచిర్యాల: సైబర్ క్రైమ్ ఉచ్చులో విద్యార్థిని

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాలకు చెందిన ఓ విద్యార్థిని సైబర్ క్రైమ్ ఉచ్చులో పడి రూ. 2, 25, 585 నగదు పోగొట్టుకుంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ ఆధారంగా టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు అదనంగా వస్తాయని నమ్మించాడు. లింక్‌ల ఆధారంగా వారం రోజుల పరిధిలో నగదును జమ చేసింది. అయినప్పటికీ ఎలాంటి నగదు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది.