Telangana

News April 9, 2024

HYD: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్‌పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు
∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన
∆} దమ్మపేటలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} చింతకాని మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

News April 9, 2024

HYD: నేడు సాలార్‌జంగ్ మ్యూజియానికి సెలవు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సాలార్‌జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు పండుగ సెలవు నేపథ్యంలో సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

కామారెడ్డి: బస్సు ఢీకొని MBA విద్యార్థి మృతి

image

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ఆకుల అరుణ్ (23) మృతి చెందాడు. అరుణ్ గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదుతున్నాడు. కాగా నిన్న సాయంత్రం స్నేహితుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని వెళ్తుండగా ఓ పరిశ్రమకు చెందిన బస్సు అతని బైకును ఢీకొట్టింది. దీంతో అరుణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

జైపూర్: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

జైపూర్ మండలంలో దారుణం జరిగింది. 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ వైద్య సురేశ్.. తన ఇంటి ముందు ఉన్న 2వ తరగతి చదువుతున్న చిన్నారికి ఐస్ క్రీం కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 9, 2024

MBNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులు, మహిళలకు లాజిస్టిక్ విభాగాల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు. అర్హులైన మహిళలు భూత్పూర్ పురపాలికలోని అమిస్తాపూర్ కేంద్రంలో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 9, 2024

SRPT: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

డిగ్రీ పూర్తి చేసిన వంద మంది మైనారిటీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సీఎస్ఏటీలో రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం, దివ్యాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 22 వరకు www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News April 9, 2024

HYD: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 1,66,475 దరఖాస్తులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,66,475 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం.రాధారెడ్డి HYDలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉందని తెలిపారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.