Telangana

News April 9, 2024

HYD: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 1,66,475 దరఖాస్తులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,66,475 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం.రాధారెడ్డి HYDలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉందని తెలిపారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

News April 9, 2024

గంభీరావుపేట: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలను సస్పెండ్ చేశారు. పాఠశాలల కార్యదర్శి సీతాలక్ష్మీ ఆదేశాల మేరకు ఆర్సీఓ సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 5న పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న యశస్విని తల్లిదండ్రుల ముందు ప్రిన్సిపల్ కొట్టడంతో నిర్మలను సస్పెండ్ చేసినట్లు ఆర్సీఓ తెలిపారు.

News April 9, 2024

HYD: చావు డప్పు మోగిస్తామని కాంగ్రెస్‌కు హెచ్చరిక

image

ఈనెల 15 లోగా మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకపోతే కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌తో పాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో చావు డప్పు మోగిస్తామని టీ ఎమ్మార్పీఎస్‌ చీఫ్ వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ హెచ్చరించారు. HYD విద్యానగర్‌లోని ఆ సంఘం స్టేట్ ఆఫీస్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఎండల ఎఫెక్ట్… జిల్లాలో తగ్గుతున్న కూరగాయల సాగు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓవైపు సాగు నీటి కొరత, దంచికొడుతున్న ఎండలు కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా ఉన్న పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమయ్యాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు నీటి వనరులు ఎండిపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించినా ఎండ తీవ్రతతో నీరు అందక మధ్యలోనే పంటలను వదిలేస్తున్నారు.

News April 9, 2024

KTDM: కూలర్ కడుగుతుండగా కరెంట్ షాక్.. యువకుడి మృతి

image

కూలర్‌ కడుగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. కొత్తగూడెం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి రామవరంలో ఈ విషాదం జరిగింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 7వ నంబర్‌ బజార్‌కు చెందిన సయ్యద్‌ షోయబ్‌ (28) ఇంట్లో మోటార్‌ ఆన్‌ చేసి కూలర్‌ను కుడుతున్నాడు. మోటార్‌ వైర్‌ తెగి కాలుపై పడగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 9, 2024

అడుగంటిన రిజర్వాయర్లు, చెరువులు

image

ఖమ్మం జిల్లాలో 984 చెరువులు ఉండగా.. వీటి పరిధిలో 1.50 లక్షల పైచిలుకు ఆయకట్టు ఉంది. వానాకాలం వర్షాలు లేక చాలా చెరువులు పూర్తిగా నిండలేదు. వానాకాలం సాగు బాగానే ఉన్నా.. యాసంగిలో మాత్రం సాగు తగ్గింది. దీంతో రైతులు 20వేల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈ చెరువుల కిందే తాగునీటి పథకాలు ఉన్నాయి. కాగా, మొత్తం చెరువుల్లో కేవలం 11 చెరువుల్లోనే 75 శాతం లోపు, మూడు చెరువుల్లో 75 నుంచి 100శాతంలోపు నీటి మట్టం ఉంది.

News April 9, 2024

భద్రాచలం: రామయ్య కళ్యాణ వేదిక పెద్దలు వీరే

image

నవమి రోజున శ్రీ సీతారామ కల్యాణం నిర్వహించే వారిలో వైదిక పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతీ క్రతువులో వీరు పాల్గొని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా శాస్త్రోక్త పాత్ర పోషిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో పొడిచేటి సీతారామానుజాచార్యులు, బ్రహ్మగా అమరవాది గోపాలకృష్ణమాచార్యులు , ఆచార్యులుగా కోటి శ్రీమన్నారాయణాచార్యులు వైదిక పెద్దలుగా  వ్యవహరిస్తారు.

News April 9, 2024

HYD: ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

image

రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేసవి ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండ దంచికొట్టింది. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 40.6 డిగ్రీలు, శేరిలింగంపల్లి ప్రాంతంలో 39.8 డిగ్రీలు, ఉప్పల్‌ పరిధి మారుతీనగర్‌లో 39.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.