Telangana

News April 8, 2024

కొండగట్టు మెట్ల దారి సమీపంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు మెట్ల దారి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన మల్లయ్య(45)కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈరోజు కుటుంబ సభ్యులు కొండగట్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

News April 8, 2024

నల్గొండ జిల్లా ప్రజలకు SP కీలక సూచన

image

విద్యార్థినులు, మహిళలు ఫేస్ బుక్, వాట్స్‌అప్, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP చందన దీప్తి సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు పటిష్ఠమైన నిఘా పెట్టిందన్నారు.

News April 8, 2024

NZB: గోదావరి నదిలో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

గోదావరి నదీలో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగపూర్ గ్రామానకి చెందిన సూర్యతేజ (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు యంచ పరిధిలోని గోదావరిలో నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

పెద్దపల్లి: కారును ఢీ కొట్టిన లారీ.. పలువురికి గాయాలు

image

పెద్దపల్లి సమీపంలోని బంధంపల్లి వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గోదావరిఖనికి వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. దీంతో కారులోని పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

పద్మాక్షి ఆలయంలో రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు

image

హన్మకొండలో ప్రసిద్ధి చెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో నూతన ఉగాది సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అర్చకులు తెలిపారు. ఈనెల 9 నుంచి 17 వరకు రోజుకు ఒక్కో రకమైన 21 కిలోల పుష్పాలతో పుష్పయాగం శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యుల సమక్షంలో నిర్వహించబడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.

News April 8, 2024

Water Crisis: హైదరాబాదీ ఇకనైనా మేలుకో!

image

HYDలో విచ్చలవిడిగా‌ నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్‌ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్‌ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్‌ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో. SAVE WATER

News April 8, 2024

Water Crisis: హైదరాబాదీ ఇకనైనా మేలుకో!

image

HYDలో విచ్చలవిడిగా‌ నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్‌ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్‌ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్‌ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో.
SAVE WATER

News April 8, 2024

పటాన్‌చెరు: రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి మృతి

image

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి ఆకుల అరుణ్ (23) మృతిచెందాడు. ఇస్నాపూర్ వెళ్లే దారిలో అరుణ్ ప్రయాణిస్తున్న బైకును ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కామారెడ్డికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

KCR నటిస్తున్నారు: పొంగులేటి

image

రైతులను రెచ్చగొట్టి పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మాజీ సీఎం కేసీఆర్ రైతు దీక్షల పేరుతో నటిస్తూ పంట పొలాలను పరిశీలిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు.

News April 8, 2024

GOOD NEWS.. KMM: ఇంటి నుంచే ఓటు వేయండి

image

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సాక్ష్యం యాప్ ద్వారా, అలాగే ఫారం 12-డిలో హోమ్ ఓటింగ్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.