Telangana

News April 8, 2024

భద్రాచలం: నిత్యకళ్యాణాలు , పవళింపు సేవలు రద్దు

image

భద్రాచలంలో ఉగాది మరుసటి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 9 నుంచి 23 వరకు బేడా మండపంలో జరిగే నిత్యకళ్యాణాలు, దర్బారు సేవలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 2వ తేదీ నుంచి పర్యంతోత్సవం , పవళింపు సేవలు ప్రారంభమవుతాయన్నారు.

News April 8, 2024

HYD: రూ.7,30,400 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.

HYD: ఆర్టీసీని వేధిస్తున్న సిబ్బంది కొరత!

image

ఆర్టీసీలో పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి.రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. HYDలోనూ రద్దీ ఉంది. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.ఈఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో1,354 మంది పదవీ విరమణ కానున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

HYD ప్రజలకు GOOD NEWS.. తగ్గనున్న ఎండ!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ‘తెలంగాణ వెదర్ మెన్’ X వేదికగా గుడ్ న్యూస్ తెలిపింది. వడగాలులు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. నేడు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలియజేసింది. రాబోయే వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి, ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.  

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డికి ఉగాది పురస్కారం

image

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఉగాది పురస్కారం అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచారం చేస్తూ, 52 మార్లు రక్తదానం చేసి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ మెదక్ శాఖ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఇప్పటివరకు 4,127 యూనిట్లను సేకరించగా రెడ్డి గర్జన జాతీయ మాసపత్రిక, సామాజిక సంస్థ ఈ అవార్డు అందజేసింది.

News April 8, 2024

జగిత్యాల: ఫొటోలు ఉన్నాయని బెదిరిస్తూ.. అత్యాచారం

image

జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితతో TRనగర్‌కు చెందిన మోహన్ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని.. కోరిక తీర్చమని లేకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. నిందితుడిపై మొత్తం 13 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.

News April 8, 2024

HYDలో యాక్సిడెంట్.. NZB జిల్లా విద్యార్థి మృతి

image

HYD శివారు కీసర పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజాబాబాద్‌కి చెందిన అనిరుద్ CMR కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో కీసర పరిధి కుందన్‌పల్లి-గోధుమకుంట మార్గంలో ఓ ఆటో ట్రాలీ, బుల్లెట్ బైక్ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. హెల్మెట్ లేకపోవడంతో అనిరుధ్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు.