Telangana

News September 9, 2024

నిర్మల్: ఈనెల 29న జాతీయ స్థాయి కరాటే పోటీలు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 29న స్పోర్ట్స్ అండ్ కరాటే అసోసియేషన్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్-2024 పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడు జితేందర్ సింగ్ భాటియా తెలిపారు. పోటీల్లో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు సుమన్, టీపీసీసీ అధ్యక్షుడు మహశ్: కుమార్ గౌడ్ హాజరవుతారన్నారు.

News September 9, 2024

HYD: రేపటి కోసం.. కొత్త నగరం..!

image

భవిష్యత్ నగరానికి బంగారు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. HYD సమీపంలో తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’కి నగరం నుంచి రాకపోకలు చేసేందుకు వీలుగా నాలుగు విధాలుగా మార్గాలను అధికారులు సూచించారు. వీటన్నిటినీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ)కి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇందులో రెండు మెట్రో రైలు రూట్‌లు, మరో రెండు ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మార్గాలున్నాయి.

సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రి సమస్యలు తీరేనా..!

image

ఇటీవల గాంధీ ఆసుపత్రి మొదటిసారిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా ఆసుపత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. వీటిన్నింటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సరిపడా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, తదితర సిబ్బందిని నియమించాలి.

వేములవాడలో రోడ్ల వెడల్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పు కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూలవాగు బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు ఇరుకు రోడ్లతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్ల వెడల్పు కోసం ఏళ్ల తరబడి సర్వేలతో కాలయాపన చేశారు. కాగా ఎట్టకేలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ప్రభుత్వం రోడ్ల విస్తరణకు ఆమోదం తెలిపింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2024

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

image

జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

News September 9, 2024

HYD: నగర వాసులకు ముఖ్య గమనిక

image

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే ముఖ్య సమావేశాల కారణంగా మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జీదారులంతా విషయాన్ని గమనించి బదులుగా బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

image

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనాలను పూర్తి జాగ్రత్తగా రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్, సహాయ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం అంచనాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.