Telangana

News April 8, 2024

పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

image

పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.

News April 8, 2024

అలంకారప్రాయంగా నల్గొండ ఐటీ హబ్!

image

నల్గొండలో గత ప్రభుత్వం రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ అలంకారప్రాయంగా మారింది. ఐటీ హబ్ నిర్మాణంతో నిరుద్యోగులు సంబర పడిపోయారు. మహానగరాలకు వెళ్లకుండానే స్థానికంగా సాఫ్ట్‌వేర్ కొలువులు లభించనున్నాయని సంతోషపడ్డారు. కానీ.. నేడు కంపెనీలు ముందుకు రాక, ఉద్యోగుల సందడిలేక హబ్‌ వెలవెలబోతోంది. గతంలో 360 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకుని ప్లేస్‌మెంటు ప్రకటన కాగితాలకే
పరిమితమైంది. 

News April 8, 2024

NLG: ఐరిస్‌తో దళారులకు అడ్డుకట్ట.!

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఈ సారి కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. పౌరసరఫరాల శాఖ ఐరిస్ విధానం తీసుకొచ్చారు. గతంలో ఆధార్ అనుసంధానం, ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే వారు. తాజాగా ఓటీపీతో పాటు ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ధాన్యం విక్రయించే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంది.

News April 8, 2024

HYD: భానుడి ఉగ్రరూపం.. బయటకు రాకండి..!

image

HYD, ఉమ్మడి RRలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గమనార్హం. ఉ.8 నుంచి మొదలు సా.5 వరకు వేడి గాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మేడ్చల్‌లో 42.6, మూసాపేట 41.9, మల్కాజిగిరి 41.5, అంబర్‌పేట్ 41.4, ఉప్పల్ 41.3, ముషీరాబాద్ 41.2, చార్మినార్ 41.1, మెహదీపట్నం 41.0, ఇబ్రహీంపట్నం 41.6, వికారాబాద్‌ 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

MBNR:’ఇఫ్తార్ విందు’.. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు

image

రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఆదివారం అమరచింతలో డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో ‘ఇఫ్తార్ విందు’ ఇచ్చారు. ఇందులో MBNR కాంగ్రెస్, BJP ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరితో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి, BJP రాష్ట్ర నాయకుడు కొండయ్య పాల్గొన్నారు.

News April 8, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్యాలు

image

HYD మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఒడిసి, మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలు అలరించాయి. నిర్మల్య డాన్స్ స్కూల్ గురువు దేబస్రి పట్నాయక్ శిష్య బృందం ఒడిసి నృత్య ప్రదర్శనలో బట్టు నృత్య, పల్లవి, మోక్ష, మొదలైన అంశాలను, డా.మైథిలి అనూప్ శిష్య బృందం మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలో శ్లోకాలు, నవరసాంజలి, జతిస్వరం, కీర్తనం, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

జన్నారంలో కురిసిన భారీ వర్షం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్ 44.4, మంచిర్యాల 43.5, నిర్మల్ 42.2, ఆదిలాబాద్ 40డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ జన్నారంలో ఆదివారం వర్షం కురిసింది. మండలంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. కాగా, ఈ అకాల వర్షాలతో మామిడి, మొక్కజొన్న రైతులు పంట నష్టపోయామని వాపోతున్నారు.

News April 8, 2024

నిజామాబాద్: ఓటు నమోదుకు 7 రోజులే గడువు

image

18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి ఈ నెల 15 వరకు గడువు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు లేని వారు ఫారం 6 ద్వారా, ఓటర్ ఐడీలో మార్పులు చేర్పులకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.