Telangana

News April 8, 2024

NLG: 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

image

జిల్లాలో భానుడు ప్రతాపం తగ్గడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం జిల్లాలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిడమనూరు మండలంలో 44.5 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లి మండలంలో వడకొండ గ్రామంలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండుతుండడంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేందుకు జనం జంకుతున్నారు.

News April 8, 2024

మొదటి నుంచి పొంగులేటి అనుచరుడే..

image

భద్రాచలం MLA వెంకట్రావు పొంగులేటి అనుచరుడిగా గుర్తింపు పొందారు. 2014లో వైసీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం అసెంబ్లీ స్థానం బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. గతేడాది జులైలో కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ కష్టమని భావించి మళ్లీ ఆగస్టులో సొంతగూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

News April 8, 2024

MBNR: 550 మందికిపైగా అంగన్వాడీ టీచర్ల పదవీ విరమణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4321 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో అయిదేళ్లలోపు చిన్నారులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 30 వరకు 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, సహాయకులు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 550 మందికి పైగా పదవీ విరమణ పొందనున్నారు. ఈ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, సహాయకులకు రూ.50వేలు చెల్లించనున్నారు.

News April 8, 2024

పాతబస్తీలో 80% ఓటింగ్ ఎలా సాధ్యం: కిషన్ రెడ్డి

image

ఎంఐఎం ఉన్న పాతబస్తీ ప్రాంతాల్లో 80% ఓటింగ్ ఎలా సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్ బూత్‌లలో ఎంఐఎం అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ పై స్పందిస్తూ ముస్లిం దేశాల్లో కూడా ఇది లేదని స్పష్టం చేశారు. దేశంలో మోదీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నల్గొండ ఎంపీగా హ్యాట్రిక్ కొడుతుందా..?

image

తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ (2014,2019) MP స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2014లో గుత్తా సుఖేందర్ రెడ్డి హస్తం పార్టీ నుంచి గెలిచి తర్వాత కారెక్కారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా గెలిచి కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. కాగా ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, BJPనుంచి సైదిరెడ్డి, BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.

News April 8, 2024

పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

image

పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.

News April 8, 2024

MBNR: అక్రమ కట్టడాలను కూల్చిన ప్రభుత్వ అధికారులు

image

మహబూబ్ నగర్ పట్టణం శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలలో కొందరు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల సహకారంతో జేసిబిలతో తొలగించారు. సర్వేనెంబర్ 25లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టగా అధికారులు పలుమార్లు హెచ్చరించిన వినకపోవడంతో నేడు అక్రమాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News April 8, 2024

HYD: రేవంత్ సర్కార్‌పై ఈటల రాజేందర్ విమర్శలు

image

కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ హామీలు గుప్పిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2,500 హామీ ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.