Telangana

News April 7, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులు

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరికి రక్త పోటు(BP) లేదా మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ రెండు జబ్బుల బారినపడి వారు MBNR జిల్లాలో 89,387 మంది, NGKL జిల్లాలో 68,574, NRPT జిల్లాలో 54,232, జోగులాంబ గద్వాల జిల్లాలో 52,265, వనపర్తి జిల్లాలో 42,448 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మూత్రపిండాలు దెబ్బతిని ప్రతినెలా డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకుంటున్న బాధితులు 1,242 మంది ఉన్నారు.

News April 7, 2024

నర్సంపేట: కాంగ్రెస్ నాయకురాలి కారులో రూ.6లక్షలు స్వాధీనం

image

నర్సంపేట పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ.6లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట శివారు మహేశ్వరంలోని చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ కారులో తరలిస్తున్న రూ.6లక్షలను పట్టుకున్నారు. సరైన లెక్కపత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 7, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥రేపు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి,NGKLకు మాజీమంత్రి కేటీఆర్ రాక
♥ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ‘ఎత్తెకాఫ్’ కార్యక్రమాలు
♥MBNR:గన్‌తో కాల్చుకొని AR SI బలేశ్వర్ సూసైడ్
♥ACMP:భార్యాభర్తల మధ్య గొడవ..భర్త మృతి
♥రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన:RSP
♥పెరుగుతున్న ఎండలు..అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్లు
♥గ్రూప్స్&DSC పై ఉచిత శిక్షణ:BC,SC స్టడీ సర్కిల్
♥ఇఫ్తార్ విందు..పాల్గొన్న స్థానిక MLAలు

News April 7, 2024

లింగంపేట్: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

లింగంపేట్ మండలం ముస్తాపూర్ తండాకు చెందిన కేతావత్ కిషన్ (38) అనే గిరిజన రైతు ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. కిషన్ తన వ్యవసాయ బోరు మోటార్ వద్ద పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా కొడవలికి విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య అంజి, ఇద్దరు కుమారులు విజయ్, వినోద్ ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

√ రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన:RSP.
√బొంరాస్ పేట: ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి:విమలక్క.
√ అచ్చంపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. పెట్రోల్ పోసుకొని భర్త ఆత్మహత్య.
√ రేపు కొడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
√ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జోరుగా ఎన్నికల ప్రచారాలు.
√ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పలువురు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

News April 7, 2024

HYD: భవనంపై నుంచి కిందపడి చిన్నారి మృతి

image

ప్రమాదవశాత్తు ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మృతిచెందిన ఘటన HYD కాచిగూడ PS పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. కార్పెంటర్ రతన్ తన భార్య నీల, కుమారుడు ఆయూష్, ఏడాదిన్నర కుమార్తె రియాంషితో కలిసి నింబోలిఅడ్డలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నీల తన కుమారుడికి అన్నం తినిపిస్తుండగా కుమార్తె రియాంషి ఆడుకుంటూ బాల్కానీలో వేసిన కుర్చీ ఎక్కి కింద పడి మృతిచెందింది.

News April 7, 2024

HYD: భవనంపై నుంచి కిందపడి చిన్నారి మృతి

image

ప్రమాదవశాత్తు ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మృతిచెందిన ఘటన HYD కాచిగూడ PS పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. కార్పెంటర్ రతన్ తన భార్య నీల, కుమారుడు ఆయూష్, ఏడాదిన్నర కుమార్తె రియాంషితో కలిసి నింబోలిఅడ్డలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నీల తన కుమారుడికి అన్నం తినిపిస్తుండగా కుమార్తె రియాంషి ఆడుకుంటూ బాల్కానీలో వేసిన కుర్చీ ఎక్కి కింద పడి మృతిచెందింది. 

News April 7, 2024

NLG: చికెన్‌ ధరలు కొండెక్కాయి…!

image

ఉమ్మడి జిల్లాలో చికెన్‌ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే ముద్ద ముట్టని చికెన్‌ ప్రియులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల కిలో చికెన్‌ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 100 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు.

News April 7, 2024

నిర్మల్: మద్యం మత్తులో ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన షెక్ ఇసా(45) తాగుడుకు బానిసై మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

News April 7, 2024

HYD: 10TH పూర్తయిన వారికి GOOD NEWS

image

HYD, ఉమ్మడి RR జిల్లాలో 32 బాలుర, 31 బాలికల జ్యోతిబా ఫులే ఇంటర్ కళాశాలున్నాయి. ప్రవేశాల కోసం పది పూర్తయిన వారు ఈనెల 12లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మహేశ్వరం జ్యోతిబా ఫులే కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, HEC గ్రూపులతో పాటు వృత్తివిద్య కోర్సులు ఉన్నాయి. దరఖాస్తుకు mjpabcwreis.cgg.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.