Telangana

News April 7, 2024

HYD: 10TH పూర్తయిన వారికి GOOD NEWS

image

HYD, ఉమ్మడి RR జిల్లాలో 32 బాలుర, 31 బాలికల జ్యోతిబా ఫులే ఇంటర్ కళాశాలున్నాయి. ప్రవేశాల కోసం పది పూర్తయిన వారు ఈనెల 12లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మహేశ్వరం జ్యోతిబా ఫులే కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, HEC గ్రూపులతో పాటు వృత్తివిద్య కోర్సులు ఉన్నాయి. దరఖాస్తుకు mjpabcwreis.cgg.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

News April 7, 2024

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 29,19,465 ఓటర్లు: కలెక్టర్ 

image

చేవెళ్ల పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29,19,465 ఓటర్లు ఉన్నారని కొంగరకలాన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శశాంక తెలిపారు. లోక్ సభ ఎన్నికల నిర్వహించడం కోసం 2, 824 పోలింగ్ కేంద్రాలు, 53 సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామన్నారు.

News April 7, 2024

పిల్లి రామరాజు యాదవ్ BJPలో చేరనున్నారా..?

image

BJPలో చేరేందుకు పిల్లి రామరాజు యాదవ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇటీవల తన రాజకీయ భవిష్యత్తుపై తమ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అధిష్ఠానంతో జరిపిన చర్చలు సఫలం అవడంతో ఈనెల 9న BJPలో చేరే అవకాశం ఉన్నట్లు స్థానిక నేతలు అంటున్నారు.

News April 7, 2024

MDK: KCR, హరీశ్‌రావుపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు 

image

మామ, అల్లుడిని ఇంటికి పంపే వరకు నిద్రపోనని మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు KCR, హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటపై ఫోకస్ చేశానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలో దిగుతానని, గజ్వేల్‌లో నర్సారెడ్డి కూతురిని MLAని చేస్తానన్నారు. KCR, హరీశ్‌రావును వదిలిపెట్టనన్నారు. 

News April 7, 2024

రఘునాథ్‌పల్లి: రైలు కిందపడి విద్యార్థిని ఆత్మహత్య

image

డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం అశ్వరావుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోని(20) ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాల్లో ఫెయిల్ అయింది. మనస్తాపానికి గురైన విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

News April 7, 2024

మల్యాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన బొజ్జ లక్ష్మి (38) అనే మహిళ ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ గ్రామ శివారులోని వెంకటేశ్వర్ల గుట్టపై ఓ చెట్టుకు ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 7, 2024

రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన: RSP

image

సీఎం రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

News April 7, 2024

HYD: మేమంతా మీ వెంటే ఉంటాం: పద్మారావుగౌడ్

image

ఏ పిలుపు ఇచ్చినా ముందుకు నడిచే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీ.పద్మారావు గౌడ్ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అధైర్య పడవద్దని, మేమంతా మీ వెంటే ఉంటామని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

News April 7, 2024

HYD: మేమంతా మీ వెంటే ఉంటాం: పద్మారావుగౌడ్

image

ఏ పిలుపు ఇచ్చినా ముందుకు నడిచే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీ.పద్మారావు గౌడ్ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అధైర్య పడవద్దని, మేమంతా మీ వెంటే ఉంటామని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

News April 7, 2024

మెదక్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలి

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మతోధు కలిసి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, కౌన్సిలర్ రవీందర్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు ఉమర్, సమీర్ ఉన్నారు.