India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్రదాడిని హైదరాబాదీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సిటీలోని రహదారుల మీద కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ వద్ద శుక్రవారం ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ ముస్లిం సోదరులు కదం తొక్కారు. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నినాదాలు చేశారు. ఇక ట్యాంక్‌బండ్ మీద CM రేవంత్ రెడ్డి క్యాండిల్ మార్చ్‌కు వేలాదిమంది నగరవాసులు తరలివచ్చారు. ఉగ్రదాడి పట్ల HYDలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
నేలకొండపల్లి మండలంలో గల డీసీఎంఎస్ కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని అరుణచల రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. ధాన్యం, కొనుగోలు, ట్రాన్స్‌పోర్ట్, కాంటాలు, బిల్లులు తదితర అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మిల్లర్లకు సూచించారు. సీపీ వెంట సీఐ సంజీవ్, ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు.
ఇల్లందకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. రూ.40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను మహిళలకు ఉచితంగా అందిస్తున్నామని, తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. 6 నెలలకు ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు శుభ్రంగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ప్రభుత్వ కన్జ్యూమర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై జాయింట్ సెక్రటరీ ప్రియాంక అల అన్నారు. శుక్రవారం మెదక్ మండలంలోని కొంటూర్, రాజ్ పల్లి, బాలనగర్ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేకులపల్లి మండలం రేగులతండాలో పురుగు మందు తాగి దంపతులు దీపిక, శ్రీను ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు రేపటిలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికలు తెలిపిన వివరాలు.. మునుగోడు మండలం ఊకోండి శివారులో బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పింఛన్లు నేటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పింఛనుదారులు గమనించి పోస్టాఫీసుల ద్వారా తమ పింఛన్లను పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా పింఛన్ పొందాలని సూచించారు.
ఖమ్మం నగరంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారు. నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీ శ్రీ సర్కిల్ వద్ద 35 అడుగుల రోడ్డుపై ఏర్పాటు చేసిన టీ స్టాల్‌ను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, DRF సిబ్బందితో కలిసి తీసివేశారు. నగర శుభ్రత, వాహన రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్‌డీ (పీహెచ్‌డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT
Sorry, no posts matched your criteria.