Telangana

News April 7, 2024

బెజ్జూర్: పులి దాడిలో ఆవు మృతి

image

పులి దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన బెజ్జూర్ రేంజ్‌లో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూరు మండలం పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన గుర్లె శంకర్ ఆవు శనివారం ఉదయం సిద్దాపూర్ అటవీ ప్రాంతానికి మేతకు వెళ్ళింది. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు.

News April 7, 2024

BRS ఓటమి అప్పుడే ఖారారైంది: కడియం

image

TRSను BRS మార్చడం తనకు నచ్చలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారినప్పుడే పార్టీ ఓటమి ఖాయమైందన్నారు. దీనిపైనా, పార్టీ నిర్మాణంపైనా అంతర్గత సమావేశాల్లో మాట్లాడానని ఆయన తెలిపారు. తానుఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని.. కానీ ఒత్తిడితో తప్పని పరిస్థితుల్లో పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

News April 7, 2024

సికింద్రాబాద్‌లో నేనే గెలుస్తా: కిషన్ రెడ్డి

image

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం HYD బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ప్రజలంతా బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

సంగారెడ్డి: ఇఫ్తార్ విందులో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ

image

జహీరాబాద్ పట్టణంలో మహ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణీక్ రావు, BRSఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ వేళలో ముస్లింలతో పాటు వీరంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండ్లు, ఫలాలు, విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2024

BREAKING: నివేదితకు BRS కంటోన్మెంట్ టికెట్

image

BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజవర్గ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను KCR ప్రకటించారని ఆ పార్టీ నాయకులు ఈరోజు తెలిపారు. ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో దివంగత నేత సాయన్న రెండో కుమార్తె నివేదితకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉగాది రోజు అధికారికంగా నివేదిత పేరును KCR ప్రకటిస్తారని నాయకులు మీడియాకు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA లాస్య మరణించిన విషయం తెలిసిందే.

NLG: జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన: MLA

image

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని BRS ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు IPL చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందన్నారు.

News April 7, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

image

కొత్తూర్, నందిగామ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత నాదని, నన్ను ఆశీర్వదదించి , పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరారు. ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

News April 7, 2024

చర్ల: 2 తలలు 6 కాళ్ళతో వింత దూడ జననం

image

చర్ల మండల పరిధిలోని జీపీ పల్లి గ్రామంలో ఆదివారం రెండు తలలు, ఆరు కాళ్ళతో లేగదూడ జన్మించింది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఆవు ఆదివారం తెల్లవారుజామున ఈనింది. పుట్టిన లేగదూడ రెండు తలలు, ఆరు కాళ్ళతో ఉంది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి ఇంటికి తండోపతండాలుగా తరలి వచ్చి లేగ దూడను చూశారు. కాగా లేగదూడ పుట్టిన గంట తర్వాత మృతి చెందిందని బోరా శ్రీనివాసరెడ్డి తెలిపారు.