Telangana

News April 7, 2024

HYD: కాంగ్రెస్ సభకు వెళ్లొస్తూ యాక్సిడెంట్

image

కాంగ్రెస్ సభకు వెళ్లొస్తూ ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలం గొల్లగూడ వాసి మహిపాల్ తుక్కుగూడలో గత రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు హాజరై తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో చేవెళ్ల ధర్మసాగర్ గేటు వద్ద అతడి బైక్‌ను మరో వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి అతడిని పరామర్శించారు.

HYD: ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్: సునీతారెడ్డి

image

ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నిజాంపేట్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి సాదరంగా ఆమె ఆహ్వానించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలని సూచించారు.

MDK: రాహుల్ గాంధీ ఎప్పటికీ PM కాలేరు: MLA

image

దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీస్తుందని, మూడోసారి ఆయనే ప్రధాని కావడం ఖాయమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే, ఆ పార్టీ జహీరాబాద్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జహీరాబాద్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని విమర్శించారు. బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. దీనిపై మీ కామెంట్?

News April 7, 2024

MNCL: BJP, BRSలను ఎన్నికల్లో ఓడించాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

పార్లమెంట్ ఎన్నికల్లో BJP, BRSలను ఓడించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని అన్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.

News April 7, 2024

కామారెడ్డి:’వడ దెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి’

image

వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ సూచించారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికంగా నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితులలో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు తెలిపారు.  ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలన్నారు.

News April 7, 2024

MBNR: బస్సు పాసులపై మహాలక్ష్మి ప్రభావం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు పెరిగాయి. ఈ పథకంతో అన్ని రకాల బస్సు పాసులపై ప్రభావం పడింది. బస్సు పాస్ తీసుకునే వారి సంఖ్య తగ్గిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, పేద మహిళలు ఇలా తేడా లేకుండా మహాలక్ష్మి పథకం వర్తించడంతో వారందరూ ఉచిత ప్రయాణం చేస్తున్నారు.

News April 7, 2024

ఖమ్మం: నెరవేరిన మంత్రి పొంగులేటి శపథం..!

image

BRS పై పొంగులేటి చేసిన శపథం నెరవేరింది. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క BRS ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకునేలా కృషి చేశారు. అయితే ఒకే స్థానం BRS గెలిచింది. ఆ ఒక్క MLA తెల్లం వెంకట్రావును కూడా నేడు కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో BRSకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పొంగులేటి శపథం నేరవేరిందని స్థనికంగా చర్చ జరుగుతుంది.

News April 7, 2024

HYD: మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

image

బీజేపీ HYD పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. ”మాధవీలతా జీ.. మీ ఆప్‌ కీ అదాలత్‌ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు” అంటూ మోదీ ట్వీట్ చేశారు.