Telangana

News April 7, 2024

BSPతోనే బహుజనులకు రాజ్యాధికారం: మంద ప్రభాకర్

image

ADB జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బహుజనులు శాశ్వత బానిసలు అవుతారన్నారు. BSP తోనే బహుజనులకు రాజ్యాధికారం లభిస్తుందన్నారు. జిల్లా నాయకులు రత్నపురం రమేష్, జంగుబాపు, తదితరులున్నారు.

News April 7, 2024

సిరిసిల్ల: 14 కేసులు నమోదు చేశాం: ఎస్పీ

image

అక్రమవడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులపై 14 కేసులు నమోదు చేశామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ… జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మందిపై కేసులు నమోదు చేసి వారి నుండి రూ.16,13,000, 359 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

News April 7, 2024

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రావి ఆకుపై బీజేపీ లోగో

image

బీజీపే ఆవిర్భావ దినోత్సం సందర్భంగా బిచ్కుందకు చెందిన ఆర్టీస్ట్ బాలకిషన్ ఆ పార్టీకి చెందిన లోగో రావి ఆకుపై వేశాడు. దాన్ని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతారకు బిచ్కుంద బీజేపీ కార్యాలయంలో అందజేశారు. వినూత్నంగా రావి ఆకుపై ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం పట్ల అరుణతార.. ఆర్టిస్ట్‌ను అభినందించారు. ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

News April 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో ఉరి వేసుకుని నేత కార్మికుడి ఆత్మహత్య @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలు. @ కోరుట్ల పట్టణంలో ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి. @ సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ.

News April 6, 2024

UPDATE.. భద్రాద్రి: మృతులు వీరే

image

దమ్మపేట మండలం మందలపల్లి రోడ్డు ప్రమాద బాధితుల వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ(35) చీపు లక్ష్మీ(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అశ్వారావుపేటలోని కోళ్ల ఫారంలో పని చేయడానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందగా.. భర్త రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.

News April 6, 2024

మల్కాజిగిరి పార్లమెంట్‌లో సమన్వయకర్తలు వీరే!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని BRS పార్టీ అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంభీపూర్ రాజు(MLC), మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు ,కూకట్‌పల్లి-బేతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ -రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ -బొగ్గరపు దయానంద గుప్త ఎమ్మెల్సీని నియమించారు.

News April 6, 2024

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సిద్దిపేట 43.9, లకుడారం 43.7, రేగోడు 43.2, చిట్యాల 43.0, దూల్మిట్ట 42.9, తుక్కాపూర్ 42.6, రాఘవపూర్ 42.4, రాంపూర్ 42.2, దామరంచ, బెజ్జంకి 42.0, రేబర్తి, కట్కూర్ 41.9, కొమురవెల్లి 41.8, సదాశివపేట, మల్చల్మ 41.6, నారాయణరావుపేట, జిన్నారం 41.5, సముద్రాల, పోడ్చన్ పల్లి 41.4, చౌటకూరు, అంగడికిష్టాపూర్ 41.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒‘కాంగ్రెస్‌ జన జాతర’ సభకు తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు,శ్రేణులు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా BRS నాయకుల “రైతు దీక్ష”
✒పెబ్బేర్:జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
✒BJPకి 400 సీట్లు పక్కా:DK అరుణ
✒పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా !
✒తలకిందులుగా తపస్సు చేసిన BRSకు ఒక్క సీటు రాదు:మంత్రి జూపల్లి
✒ఉమ్మడి జిల్లాలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✒నేడు ‘షబ్‌-ఎ- ఖాదర్’..రాత్రంతా జాగారం

News April 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వస్తున్నారా..? పోలీసుల హెచ్చరిక

image

HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT

News April 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వస్తున్నారా..? పోలీసుల హెచ్చరిక 

image

HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి  వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT